మాకు సేఫ్టీ కల్పించమని ఓయూ విద్యార్థులను కోరిన శ్రీరెడ్డి!

Thursday, April 12th, 2018, 02:50:43 AM IST


కాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయంటూ గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో పెద్ద కలకలమే రేపారు హీరోయిన్ శ్రీ రెడ్డి. టాలీవుడ్‌లో అవకాశాల పేరుతో లొంగదీసుకుని తెలుగు అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారంటూ తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తనతో సెలబ్రెటీలు జరిపిన ఛాట్ లిస్ట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న శ్రీరెడ్డి ఇటీవలే ఫిలిం చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉదంతంపై ‘మా’ సభ్యులు తీవ్రంగా విరుచుకుపడుతూ శ్రీ రెడ్డితో ‘మా’ సభ్యులెవరూ నటించకూడదని, ఆమెకు ఎన్నటికీ మా సభ్యత్వం ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు.

దీంతో షాకైన శ్రీ రెడ్డి ఏమాత్రం జంకకుండా నేషనల్ మీడియాకు ఎక్కుతానంటూ సవాలు విసిరి తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది. అంతే కాక ఆమె నిన్న ఒక జాతీయ ఛానల్ డిబేట్ లో పాల్గొని, ఒకప్రముఖ నిర్మాతకొడుకుకు సంబందించిన పేరు బయటపెట్టారు. కాగా శ్రీ రెడ్డి పాపులారిటీ కోసమే ఇదంతా చేస్తోందంటూ కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఆమెకి అండగా నిలుస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఓయూ విద్యార్థులు ఈమెకు మద్దతు తెలిపారు. శ్రీ రెడ్డిని ఓయూకి పిలిచి మరీ నీకు అండగా ఉంటాం అని తెలిపారు. ఈ సందర్బంగా ఓయూలో విలేకరులతో మాట్లాడిన శ్రీ రెడ్డి ఎమోషన్‌కి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.

అన్నా, ఓ తెలుగు ఆడబిడ్డ అన్యాయానికి గురైతే ఎవరూ ఊరుకోరంటూ ఈ రోజు మీరు ఓయూకు పిలిచి మరీ నాకు అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు అంటూ మాట్లాడారు. నేనొక్కదాన్నే కాదు ఇంకా చాలామంది చెల్లెళ్ళు సినీ పెద్దల చేతుల్లో నలిగి పోతున్నారన్నా, మాకు సేఫ్టీ క్రియేట్ చేయండని మిమ్మల్ని వేడుకుంటున్నా అంటూ ఓయూ విద్యార్థులను వేడుకున్నారు శ్రీ రెడ్డి. దీనిపై స్పందించిన ఓయూ విద్యార్థి జేఏసీ శ్రీరెడ్డికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం శ్రీరెడ్డి ఒక ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ అలానే ఒక ప్రముఖ దర్శకుడు తనతో జరిగిపిన వాట్సాప్ తాలూకు స్క్రీన్ షాట్స్ బయటపెట్టారు…..