మా అధ్య‌క్షుడిపై ఘోర‌మైన కామెంట్స్‌

Wednesday, September 5th, 2018, 03:59:47 AM IST

ప్ర‌స్తుతం మూవీ ఆర్టిస్టుల సంఘం నిధుల గోల్‌మాల్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మా అధ్య‌క్షుడు శివాజీరాజా నిధులు మాయం చేశార‌ని, రికార్డులు మాయం చేశార‌ని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌రేష్ ఆరోపించ‌డంతో ఇందులో నిజం ఎంత‌? అంటూ ఆస‌క్తిగా చ‌ర్చ సాగుతోంది. దీనిపై ఉన్న‌తాధికారుల‌తో క‌మిటీ వేయాల‌ని న‌రేష్ సీరియ‌స్ అవ్వ‌డం చూస్తుంటే గొడ‌వ చాలా పెద్ద స్థాయికే వెళుతోంది. ర‌చ్చ మీడియాకెక్కింది కాబ‌ట్టి.. స‌రిగ్గా టైమ్ చూసి త‌న‌దైన శైలిలో మ‌రోసారి బాంబ్ పేల్చింది న‌టి శ్రీ‌రెడ్డి. త‌న‌కు మా అసోసియేస‌న్ మెంబ‌ర్‌షిప్ ఇవ్వ‌నందుకు క‌క్ష తీర్చుకునేందుకు మ‌రో అవ‌కాశం ఈ అమ్మ‌డికి ల‌భించింది.

“న‌న్ను ప‌బ్లిసిటీ స్టంట్ అన్న శివాజీ రాజాకి, శ్రీ‌కాంత్‌కి గోచి ఊడి, ద‌రిద్ర‌పు గ‌తి ప‌ట్టింది. మోస‌పోయి నేనొస్తే, ఓదార్చాల్సింది పోయి, బడా ఫ్యామిలీస్‌ని కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. నాకు కోట్ల రూపాయ‌లు ఇవ్వాల‌ని శివాజీరాజా అత‌ని ఒత్తులు ప్ర‌య‌త్నం చే్తే, నేను తీస్కోలేదు క‌డుపు మండి. నా విష‌యంలో శివాజీ రాజా ప్ర‌వ‌ర్త‌న బాధాక‌రం. ఆడ‌పిల్ల‌ల్ని కాల్చుకుతినే బ్రోక‌ర్స్ వీళ్లు. సెటిల్‌మెంట్స్ చేసే గూండాలు. త‌ల్లి తండ్రులునే చూడ‌లేదు.. శివాజీగారు ముస‌లోళ్ల‌కి వృద్ధాశ్ర‌మ‌మ్ క‌ట్టిస్తారా? అంటూ ట్విట్ట‌ర్‌లో సుదీర్ఘ‌మైన వ్యాసం రాసింది శ్రీ‌రెడ్డి. మొత్తానికి టైమ్ చూసి చిత‌క‌మోదే కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పెట్టింది ఈ న‌టి. ఇక‌పోతే త‌న‌పై ప‌డిన నింద‌ను నిజం కాద‌ని శివాజీ రాజా నిరూపించాల్సి ఉంది. అలానే శ్రీ‌రెడ్డి ప్రశ్న‌ల‌కు ఆయ‌న నుంచి ఏం స‌మాధానం వ‌స్తుందో ?

  •  
  •  
  •  
  •  

Comments