శ్రీ రెడ్డి తల్లి గర్వంగా ఫీలవ్వాలి : రాంగోపాల్ వర్మ

Thursday, April 12th, 2018, 08:53:17 PM IST


కొద్దిరోజులనుండి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయంలో హీరోయిన్ శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు, లీక్ లకు కొంత మంది వ్యతిరేకిస్తుంటే మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. అందులో ముఖ్యంగా సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఈ విషయమై ఇప్పటికే స్పందించి, శ్రీరెడ్డి ప్రస్తుతం ముంబైలో పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ పాపులర్ అయిందని ట్వీట్ సంచలనానికి తెర లేపారు. కాగా వర్మ నేడు ఆమెకు మద్దతుగా ట్వీట్స్ చేసారు. శ్రీరెడ్డి చెపుతున్నట్లు ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనేది ఉందని, అది ఇప్పుడు కాదని ఎప్పుడో 100 సంవత్సరాల నుండి వుంది.

మొదటి నుండి ఇటువంటి ఘటనలు జరిగి ఉండొచ్చు, కానీ దానిని నేడు ధైర్యంగా ఎదిరించి ముందుకు వచ్చిన శ్రీరెడ్డికి తన అభినందనలు తెలిపారు. అలానే అసలు ఇంత గొప్ప అమ్మాయిని కన్న ఆమె తల్లి నిజంగా గర్వంగా ఫీల్ అవ్వాలని, అలానే ఆమె తెలుపుతున్ననిరసనని కొందరు వ్యతిరేకించడం తనను షాక్ కి గురిచేసిందని, తన నిరసనతో జాతీయ, అంతర్జాతీయంగా జరుగుతున్న ఇటువంటి అఘాయిత్యాలు పై ముందుకొచ్చి గళంవిప్పిన ఆమెకు తన ట్వీట్ ద్వారా మద్దతు తెలియచేసారు…..

  •  
  •  
  •  
  •  

Comments