జగన్ పై దాడి చేసిన యువకుడు తెలుగుదేశం వ్యక్తే సంచలన సాక్ష్యం..!

Sunday, October 28th, 2018, 03:42:12 PM IST

వై ఎస్ జగన్ పై జరిగిన దాడికి సంబందించిన సాక్ష్యాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు.జగన్ పై దాడి తెలుగుదేశం పార్టీ వారే చెయ్యించారని వైసీపీ వారు, వైసీపీ జగనే తనపై తాను కావాలనే చేయించుకున్నాడని తెలుగుదేశం పార్టీ వారు ఒకరి మీద విమర్శలు చేసుకుంటున్నారు.ఇప్పటికే ఇరు పార్టీల వారు మీ పార్టీకి చెందిన కార్యకర్త అంటే మీ కార్యకర్త అని వారికి వారే ఏవేవో సాక్ష్యాలు సృష్టించేసుకుంటున్నారని కూడా ఆరోపణలు చేసుకుంటున్నారు.ఇప్పుడు తాజాగా జగన్ పై దాడి చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తే అని వైసీపీ కి చెందిన నేత జోగి రమేష్ అంటున్నారు,జగన్ మీద కుట్రపూరితంగానే ఈ దాడి చంద్రబాబు చెయ్యించారని మండిపడ్డారు.

శ్రీనివాస రావు జగన్ యొక్క అభిమాని అని చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు.అసలు ఈ శ్రీనివాసరావు ఎవరని,ఇతని వెనుక ఉన్నటువంటి సూత్రధారులు,కుట్ర దారులు ఎవరు అని,”శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఉన్న సభ్యత్వ కార్డుని చూపించి ప్రశ్నించారు”.నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు దొరక్కూడదని ఢిల్లీలో కూడా అబద్దాలు చెప్తున్నాడని మండిపడ్డారు.శ్రీనివాస రావు కు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సభ్యత్వ కార్డు యొక్క కాపీ ను చూపిస్తూ,ఇతను తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి క్రియాశీలక కార్యకర్త,ఇతని వెనుక ఉన్నది ఎవరు అని ప్రశ్నించారు.ఇతన్ని ప్రేరేపించి జగన్ మీద దాడి చేయించిన సూత్ర దారులు ఎవరో బయటకి రావాలని మండిపడ్డారు.ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి జగన్ మీద దాడి జరిగితే చిన్న దెబ్బ,గుండు సూది గుచ్చుకున్నట్టు ఉన్న గాయం అని చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments