హీరో అర్జున్ న‌న్ను బాగా ఇబ్బంది పెట్టాడు.. శృతి హ‌ర‌హ‌ర‌న్ సెన్షేష‌న్..!

Saturday, October 20th, 2018, 07:02:58 PM IST

సినీ ప‌రిశ్ర‌మ‌లో లైంగిక వేధింపులకు వ్య‌తిరేకంగా ఏర్ప‌డిన మీ..టూ ప్ర‌కంపన‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా కోలీవుడ్ న‌టి శృతి హ‌ర‌హ‌ర‌న్.. త‌మిళ‌ సీనియ‌ర్ హీరో అర్జున్ పై చేసిన ఆరోప‌ణ‌లు కోలీవుడ్‌లో సంచ‌ల‌నం రేపుతున్నాయి. అస‌లు విష‌యం లోకి వెళితే అర్జున్ నటించిన నింబునం చిత్రం గ‌త ఏడాది త‌మిళంలో రిలీజ్ అయ్యి మంచి విజ‌యం సాధించింది. ఇక కురుక్షేత్రం పేరుతో తెలుగులో ఈ ఏడాది విడుద‌ల అయ్యింది. అయితే ఈ చిత్రంలో శృతిహ‌ర‌హ‌ర‌న్ నటించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ చిత్రం షూటింగ్ స‌మ‌యంలో అర్జున్ త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని శృతి ఆరోపించింది.

నింబునం చిత్రంలో అర్జున్ భార్య‌గా శృతి నటించింది. అయితే ఆ చిత్రంలో భాగంగా ఒక సీన్‌లో అర్జున్ త‌న‌ని హ‌గ్ చేసుకునే సీన్ ఉంది. అయితే ఆ సినిమా డైరెక్ట‌ర్ టేక్ చెప్ప‌కుండానే అర్జున్ త‌న‌ని కౌగిలించుకొని త‌న వీపుకింది భాగాన్ని గ‌ట్టిగా నొక్కాడ‌ని.. ఆ టైమ్‌లో త‌న‌కు ఏం చేయాలో అర్ధం కాలేద‌ని.. అర్జున్ ప్ర‌వ‌ర్త‌న‌తో ఒక్క‌సారిగా షాక్ తిన్నాన‌ని శృతి తెలిపింది. అయితే నాడు సైలెంట్‌గా ఎందుకు ఉన్నానంటే.. అర్జున్‌కి ఇండ‌స్ట్రీలో పెరు ప్ర‌ఖ్యాతులు ఎక్కువ అని.. అందువ‌ల్ల ఆరోజు త‌ను కామ్‌గా ఉన్నాన‌ని చెప్పింది శృతి. దీంతో శృతి వ్యాఖ్య‌లు టాలీవుడ్, కోలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.. ఎందుకంటే సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో అర్జున్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు.. ముఖ్యంగా ఆయ‌న వివాదాల‌కు చాలా దూరంగా ఉంటారు.. అయితే ఇప్పుడు ఏకంగా ఆయ‌న పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు రావ‌డంతో సౌత్ సినీ వ‌ర్గాల్లోనే పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మ‌రి శృతి వ్యాఖ్య‌ల పై అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments