పాపం అనాలా..పొగరు అనాలా.. అలరించిన ఆటగాడి పరిస్థితి ఏంటి..!!

Saturday, September 30th, 2017, 10:11:48 AM IST

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో పోటీ పడి ఆడిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. సరిసమాన బాలలు ఉన్నప్పుడు ఎదో ఒక విభిన్న లక్షణం ఎవరో ఒకరినే విజేతగా నిలబెడుతుంది. అదే సచిన్ ని శిఖరాన నిలిబెట్టింది. సచిన్ సమకాలీనుడుగా రికీపాంటింగ్ ప్రతిభతో సచిన్ కు పోటీగా నిలిచాడు. కానీ క్రమశిక్షణ చివరకు సచిన్ నే విజేతగా చేసింది. దురుసు ప్రవర్తనతో రికీపాంటింగ్ కు అనేక మరకలు ఉన్నాయ్.

అదే కోవలో పయనిస్తున్న స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కెరీర్ నే ప్రమాదంలో పడేసుకున్నాడు. తక్కువ టైంలోనే ప్రపంచ క్రికెట్ లో ప్రతిభ గల ఆల్ రౌండర్ గా బెన్ స్టోక్స్ ప్రశంసలు అందుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంగ్లాండ్ జట్టుకు వెన్నెముకగా మారాడు. కాగా తాజాగా తన కెరీర్ నే ప్రమాదంలో పడేసుకున్నాడు. మైదానం బయట ఇతగాడి దూకుడు అంతా ఇంతా కాదు. మద్యం మత్తులో ఓ వాయ్కటిని చితక బాదిన కేసులో ఇరుక్కోవడంతో అత్యంత కీలకమైన యాషస్ సిరీస్ కు దూరం అయ్యాడు. నేరం రుజువైతే స్టోక్స్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

స్టోక్స్ ప్రతిభ ఎవరూ వేలెత్తి చూపలేనిది. నాతో స్టోక్స్ ని పోసిస్తున్నారు. నిజాంనికి నేను కూడా 26 ఏళ్ల వయసులో అంత బాగా ఆడలేదు అని ఇయాన్ బోథమ్ స్టోక్స్ పై ప్రశంసలు కురిపించాడుతన రెండవ టెస్టు మ్యాచ్ ద్వారానే తానేంటో ప్రపంచం మొత్తం చూసేలా చేసాడు. పెర్త్ లో దక్షణాఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 198 బంతుల్లో 258 పరుగులతో ప్రంచం మొత్తాన్ని ఔరా అనిపించేఇన్నింగ్స్ ఆడాడు. టెస్టు క్రికెట్ లో ఇది రెండవ వేగవంతమైన డబుల్ సెంచరి. అలాంటి ఆటగాడి కెరీర్ ప్రమాదంలో పడడం నిజంగా బాధాకరం.

Comments