ప్రముఖ నిర్మాత రామానాయుడుకు అస్వస్థత!

Wednesday, December 24th, 2014, 07:47:49 PM IST

ramanaidu
తెలుగు చిత్ర సీమలో పేరెన్నిక గన్న నిర్మాత, మాజీ ఎంపీ డాక్టర్ రామానాయుడు అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్లు సమాచారం తెలుస్తోంది. కాగా 78 సంవత్సరాల రామానాయుడు ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రస్తుతం రామానాయుడు తీవ్ర అస్వస్థతతో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని సమాచారం. కాగా రామానాయుడు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై పలు హిట్ సినిమాలను రూపొందించారు. అలాగే ఆయన బహు బాషా చిత్ర నిర్మాత. ఇక అతని చిత్రాల ద్వారా ఎందరో నూతన నటీనటులు వెండి తెరకు పరిచయమై అనంతరం మంచి పేరును సంపాదించుకున్నారు. అలాగే రామానాయుడుకు సురేష్, వెంకటేష్ లు ఇద్దరు పుత్రసంతానం కాగా ఇద్దరు సినీ పరిశ్రమలో స్థిరపడిన సంగతి తెలిసిందే.