స్టోక్స్ చాలా వెదవ పనులు చేశాడు.. స్మిత్ వివాదాస్పద కామెంట్స్

Monday, October 16th, 2017, 08:38:25 AM IST

క్రికెట్ లో ఆటగాళ్ల మధ్య కోపాలు ఎన్ని ఉన్నా బంతితో బ్యాట్ తో కౌంటర్లు వేయడానికి చూస్తారు. ఉన్న కోపాన్ని అంతా ఆటలోనే చూపించడానికి ట్రై చేస్తారు. అదే విధంగా కొందరు ఆటగాళ్లు మానసికంగా దెబ్బ తీయడానికి ఆటకు ముందు వ్యక్తిగత జీవితాలపై కౌంటర్లు వేసేందుకు చూస్తారు. కొన్ని దేశాల మధ్య జరిగే మాటల యుద్ధం మాములుగా ఉండదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ లు చాలా ఫెమస్ అని చెప్పాలి. పాకిస్థాన్ – ఇండియా జట్ల మధ్య వార్ ఎలా ఉంటుందో. ఆసీస్ – ఇంగ్లాండ్ మధ్య కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలోనే క్రికెట్ వార్ ఉంటుంది.

అయితే రాబోయే యాషెస్ సిరీస్ కి కూడా ఇరు జట్లు గెలవడానికి చాలా కష్టపడుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌ వివాదంలో చిక్కుకోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బె అని చెప్పాలి. ఈ విషయంపై ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఎవరు ఊహించని విధంగా కొన్ని కామెంట్స్ చేశాడు. అతను బెస్ట్ క్రికెటర్ అంటూనే.. అతను ఒక చెత్త వ్యక్తి అనేట్లు కామెంట్స్ చేశాడు. అతని ఆటనే ఈ రోజు ఈ స్థాయికి తీసుకువచ్చింది. ప్రపంచంలోనే బెస్ట్ ఆల్ రౌండర్లలో స్టోక్స్ ఒకరు. అతని బౌలింగ్ ఎంత ధాటిగా ఉంటుందో.. అతని బ్యాటింగ్ అంతకన్నా చురుగ్గా ఉంటుదని కానీ అతని బుద్ధి మాత్రం సరిగ్గా లేదని కామెంట్స్ చేశాడు. అతను చాలా వెదవ పనులు చేశాడని చెబుతూ.. ఇంగ్లాండ్ యాషెస్ లో తప్పకుండా గెలుస్తామని చెప్పాడు.

  •  
  •  
  •  
  •  

Comments