రికార్డు బద్దలు కొట్టిన స్టాక్ మార్కెట్ : సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు..!

Friday, July 27th, 2018, 07:00:12 PM IST

నేడు స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. ముంబై స్టాక్ ఎక్స్చెంజి లోని సెన్సెక్స్ బులియన్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా కనివిని ఎరుగని రీతిలో రికార్డులు బద్దలు కొట్టింది. ఇక విషయంలోకి వెళితే, సెన్సెక్స్ చరిత్రలోనే తొలిసారిగా 37 వేల పాయింట్లను తాకింది. దానితో మదుపర్లు చాలావరకు లాభాలను పొంది సంతోషాన్ని వ్యక్తపరిచారు. అంతేకాక నిఫ్టీ కూడా 11,200 పాయింట్ల దగ్గర ముగిసింది. వాస్తవానికి ఈ ఉదయం 200 పాయింట్లకు పైగా లాభాల బాటలో పయనించడం మొదలెట్టిన సెన్సెక్స్ అంతకంతకు పరుగులు తీసింది. చివరకు అధిక కొనుగోళ్ల మద్దతుతో 300 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక చివరకు 352 పాయింట్లు లాభాన్ని పొంది 37,337 వద్ద ముగిసి ఊహించని సంచలనాన్ని సృష్టించింది.

మరోవైపు నిఫ్టీ అయితే 111 పాయింట్లు లాభపడడంతో 11,278 వద్ద స్థిర పాడడం జరిగింది. ఊహించని విధంగా కంపెనీల త్రైమాసిక ఫలితాలు నమోదవడం, విదేశీ పెట్టుబడులు పెట్టడం, రూపాయి బలపడడం, ఇక దీనికి తోడుగాఆసియా మార్కెట్ సూచీలు కూడా ఒకింత సానుకూలంగా మారడంతో దేశీయ మార్కెట్ కు ఇది ఒకరకంగా వరంగా మారింది. దీనివల్ల ఒక్కసారిగా ఎఫ్ఎమ్సిజి, లోహా సహా మరికొన్ని ఆటోమొబైల్ షేర్లు మంచి లాభాల బాటలో పయనించి ఆయా షేర్ హోల్డర్లకు లాభాలు తెచ్చాయి. లాభాలుతెచ్చిన షేర్ లలో ప్రధమంగా ఎన్ఎస్ఈ లో ఐటిసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, టాటా మోటార్స్, హిందాల్కొ, టైటాన్ తదితరాలు వున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments