బీజేపీ ఎన్నికల ఫలితాల జోరు స్టాక్ మార్కెట్ హుషారు

Tuesday, May 15th, 2018, 03:47:04 PM IST

దేశంలోని కర్ణాటక ఎన్నికల ఫలితాల జోరు ఊపందుకుంటుంటే, మరోవైపు స్టాక్ మార్కెట్లు కూడా అదే స్థాయిలో ముందుకు దూసుకుపోతున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం కర్ణాటక లోని రెండవ విడుత ఎన్నికల ఫలితాల విడుదల మేరకు బీజేపీ 108తో మొదటి స్థానంలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ 78తో రెండవ స్థానంలో, జేడీఎస్ 45తో మూడవ స్థానంలో నిలిచింది. ఇదే దశలో ఓ వైపు కర్ణాటక ఎలాక్షన్స్లో కేంద్ర అధికార పార్టీ బీజేపీ సీటు ఎక్కే తరునానికి చేరువలో ఉండగా, మరో వైపు స్టాక్ మార్కెట్లు కూడా చాలా హుషారుగా పరిగెత్తుతున్నాయి.

ఈరోజు ఉదయం స్టాక్ మార్క్రట్లు కొంచం నష్టాల బాటన పడ్డా కూడా ఎన్నికల ఫలితాలు జోరందుకున్న తీరులో సెన్సెక్స్ కూడా నెమ్మదిగా పెరిగింది. ప్రస్తుతం 260 పాయింట్లతో సెన్సెక్స్ లాభాల బాటన పడింది. ఎక్జిట్ పోల్ ఊహకు అందని విధంగా భారీ మెజారిటీ స్థాయిలో బీజేపీ పయనం సాగిస్తున్నది. ఇదే ఉత్సాహం స్టాక్ మార్క్రట్లో కూడా నిండి ఉండటం వల్లనే ఏమో 35817 పాయింట్లతో సెన్సెక్స్ ట్రేడ్ అవ్వగా ఇటు నిఫ్టీ కూడా అదే స్థాయిలో 70 పాయింట్ల వరకు పెరిగి 10877 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతూ ముందుకు వెళ్తున్నది. ఈ రోజు గడిచే లోపు బీజేపీ గెలుపు, సెన్సెక్స్ లాభాలు ఎలా ఉండబోతాయో చివరి వరకూ వేచి చూడాల్సిందే.