వైరల్ వీడియో : గాలి వేగానికి విమానం విల విల

Monday, January 22nd, 2018, 08:51:07 PM IST

గత కొన్ని రోజులుగా యూరప్ నగరంలో భయంకరమైన ఫ్రెడరిక్‌ తుపాను చేసిన బీభత్సం అంతా ఇంత కాదు. తొమ్మిది మంది చనిపోగా వందల కోట్ల ఆస్థి నష్టం జరిగింది. విద్యుత్ రవాణా వ్యవస్థతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా చాలా వరకు దెబ్బతింది. దాదాపు 250 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులు నగరాన్ని భయంతో వణికించాయి. అయితే ఫైనల్ గా రెండు రోజుల క్రితం నుంచి ఆ తుపాను తీవ్రత నెమ్మదిగా తగ్గుతోంది. అయితే ఫ్రెడరిక్‌ ధాటికి కొన్ని ఊహించని ఘటనలు చోటు చేసుకున్న వీడియోలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఓ విమానం అయితే ల్యాండింగ్ కావడానికి చాలా ఇబ్బందులు పడింది. జర్మనీ డసెల్‌డార్ఫ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రాస్‌విండ్‌ ల్యాండింగ్‌ అవ్వుతుండగా ఫ్రెడరిక్‌ తుఫాను ఒక్కసారిగా రెచ్చిపోయింది. గాలి వేగానికి విమానం కొంత సేపటివరకు గాల్లోనే తేలింది. అయితే పైలెట్లు మాత్రం ఎలాంటి ఘటనకు తావివ్వకుండా జాగ్రత్తపడ్డారు. కొద్దీ సేపటికి తెలివిగా విమానాన్ని రన్ వే పై దింపారు.