విశాక చేరుకున్న అండమాన్ నౌక .. ఎంత టెన్షన్ పడ్డారంటే..

Friday, September 30th, 2016, 04:00:45 AM IST

shp
అండమాన్ వెళుతూ సాంకేతిక కారణాలతో సముద్రం లోనే నిలిచిపోయిన హర్షవర్ధన్ నౌక అండమాన్ వెళ్ళకుండానే వెనక్కి వచ్చేసింది. మధ్యలో సాంకేతిక కారణాల వలన, జెనరేటర్ పనిచెయ్యక ఆగిపోయిన ఈ నౌక పరిస్థితి ఏంటి అని జనం కంగారు పడిన వేళ కెప్టెన్ తన తెలివితేటల తో నౌక ని విశాక తీసుకొచ్చాడు. కొన్ని గంటల పాటు నడి సముద్రం లో ఆగిపోయిన నౌక , అందులో ఉన్న ఆరొందల మంది ప్రయాణీకులు కంగారు పడిపోయారు. దాదాపు 36 గంటల పాటు వారు నరకం అనుభవించి గమ్యం చేరకుండా వెనక్కి వచ్చి దేవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. నౌకలో చిక్కుకుపోయిన తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదంటూ ప్రయాణికులు ఆరోపించారు. నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 27 వ తెహ్డీ మధ్యాన్నం ఒంటిగంటన్నర కి ఈ నౌక అండమాన్ బయలుదేరింది. దీని పేరు హర్ష వర్ధన్ గా పెట్టారు. ఆరొందలమంది వరకూ ప్రయాణీకులు ఇందులో ఉన్నారు. ప్రయాణం ఆరుగంటల పాటు బాగానే సాగింది కానీ ఆరు గంటల తారవాత సాంకేతిక లోపం తలెత్తింది, దీంతో నౌకని సముద్ర మధ్యలో ఆపేశారు. ఒకదశలో నౌక క్షేమంగా తిరిగి తీరం చేరుకుంటుందో లేదోనని భయపడిన ప్రయాణికులు బుధవారం రాత్రి విశాఖ తీరానికి చేరుకోవడంతో ఊపరి పీల్చుకున్నారు.