బడ్జెట్ సమావేశాలలో తీవ్ర ఉద్రిక్తత.. టీఆర్ఎస్ నేత కంటికి గాయం..

Tuesday, March 13th, 2018, 12:48:40 PM IST

శాసనసభలో బడ్జెట్ సమావేశాలు సోమవారం రోజున నిరసనను, వాగ్వాదాలతో మొదలైంది. సభలో వగర్నార్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన నిరసనలు, నినాదాల చిచ్చులాటలో కాంగ్రెస్స్ సభ్యుడు హెడ్ ఫోన్ విసిరి కొట్టగా శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలింది. వెంటనే గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాని చెప్పగా బీజేపీసభ్యులు కుడా సభను విరమించుకొని బయటికి వెళ్ళిపోయారు.

వివరాల్లోకి వెళితే సోమవారం ఉదయం పది గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశం ప్రారంభం కాగానే గవర్నర్‌ ప్రసంగం మొదలుపెట్టిన తరవాత ఐదు నిమిషాల వరకూ సభ ప్రశాంతంగానే నడవసాగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కాంగ్రెస్‌ నాయకులు తమ సీట్లలో నుంచి లేచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ తీవ్ర ఉద్రిక్త స్థాయిలో నినాదాలు చేస్తూ పోడియం వద్దకెళ్లేందుకు వీర ప్రయత్నాలు చేసారు. ‘రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి’ అంటూ పలు రకాల నినాదాలు చేశారు. సభ ప్రారంభం కాకముందే వారిని పోడియం వద్దకు వెళ్లకుండా ఆపేందుకు ముందు జాగ్రత్తగా మార్షల్స్‌ ప్రతిపక్షాల సీట్ల ముందుకొచ్చి 4 వరసలుగా అడ్డుగా నిలిచారు. కాంగ్రెస్‌ సభ్యులు ఏదో చేయబోతున్నారని ఆలోచించిన ప్రభుత్వం ముందస్తుగా తగిన రక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్దమయింది.

గవర్నర్‌ నిలబడి ప్రసంగించే వేదిక దగ్గర కూడా మరికొందరు రక్షణగా నిలబడ్డారు. మార్షల్స్‌ ని పెట్టి ఎన్ని రక్షణా ప్రయత్నాలు చేసినా కూడా కాంగ్రెస్‌ సభ్యులు, వారిని ప్రతిఘటిస్తూ ముందుకెళ్లేందుకు బలవంతంగా ప్రయత్నించారు. ప్రసంగం ముగిసే వరకూ ఈ చిచ్చు కొనసాగుతూనే వచ్చింది. ఈ గొడవ సద్దుమనుగాక ముందే ప్రసంగ ప్రతులను కాంగ్రెస్‌ సభ్యులు ముక్కలుగా చించి పోడియం వైపు పలుమార్లు విసిరేశారు. ఈ గొడవలో కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌ఫోన్‌ను విసరగా కొట్టగా.. అది స్వామిగౌడ్‌ కంటికి తాకింది. గవర్నర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకు చూసి.. ప్రసంగం ఆపకుండా కొనసాగించారు. గొడవ జరుగుతుండగానే భాజపా సభ్యులు సీట్లలో నుంచి లేచి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపి బయటికి వెళ్లిపోయారు. వారు వెళ్లిన కాసేపటికి ప్రతిపక్ష నేత జానారెడ్డి లేచి బయటికి వెళ్లారు. అయినా కాంగ్రెస్‌ సభ్యులు ఆయన వెంట బయటికి వెళ్లకుండా సభలోనే నిలబడి ప్రసంగం ముగిసేవరకూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా నినాదాలు, నిరసన కొనసాగించారు.

ఈ ఘటనలో గాయం తగిలిన స్వామిగౌడ్ ను సరోజినీదేవి నేత్ర వైద్యాలయంలో చికిత్స అందేలా చూసారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.రవీంద్రగౌడ్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.శ్రీనివాస్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో కుడి కంటికి బి-స్కానింగ్‌ తీశారు. గ్లకోమా పరీక్షలు చేసి స్కానింగ్‌లో రెటీనాకు స్వల్ప గాయమైనట్లు మరే ఇతర ప్రమాదం లేదని తెలిపారు. మరో 24 గంటలపాటు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు సూపరింటెండెంట్‌ రవీంద్రగౌడ్‌ వెల్లడించారు. చికిత్స అనంతరం స్వామిగౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తన వద్దకు వచ్చి పరిశీలించి.. వెంటనే పరీక్షల కోసం సరోజినీదేవి ఆసుపత్రికి తీస్కువెళ్ళమని చెప్పారని, కంటికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారనీ, వాపు రావడంతో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ నిరసన తెలిపే హక్కు ఉందనీ.. అయితే ఇలాంటి చేతులు చేస్కునే హక్కు మాత్రం ఎవరికీ లేదని ఇది సరి కాదని స్వామిగౌడ్‌ వ్యాఖ్యానించారు. హాస్పిటల్ లో చేరిన స్వామిగౌడ్ ని పరామర్చించేందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాగా వీరి పర్యవేక్షణలో వైద్యం జరిగగ, కొంచం విశ్రాంతి తీస్కోమని స్వామిగౌడ్ కి చెప్పారు.

ఇదిలా ఉంటే స్వామి గౌడ్ ని పరామర్శించేందుకు కాంగ్రెస్ మంత్రులు, సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ పలువురు సభ్యులు ఆసుపత్రికి రాగా దాడి చేసి ఇప్పుడు ఎలా ఉందొ చూడటానికి వస్తారా అని టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయగా విషయం తెలుసుకున్న స్వామిగౌడ్, మరియు పోలీసులు వారిని లోపలి అనుమతివ్వమని చెప్పారు కాంగ్రెస్స్ నాయకులూ లోపలి వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఈ గొడవలన్నీ పూర్తయిన తర్వాత గవర్నర్ ప్రసంగం ముగించి సభను మళ్ళీ మంగళవారానికి వాయిదా వేసారు.

  •  
  •  
  •  
  •  

Comments