షాకింగ్ వీడియో : రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు విద్యార్థి మృతి

Sunday, March 25th, 2018, 01:15:29 AM IST

మనం, మన పని నిమిత్తం సమయం ఎక్కడ వృధా అవుతుందో అని భయపడి ఒక్కోసారి ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతుంటాం. ముఖ్యంగా కొందరు బస్సు ల్లో అలానే ట్రైన్ ల్లో అవి కదులుతున్నపుడు కూడా ఎక్కడం దిగడం వంటివి చేస్తుంటారు. నిజానికి అలా ప్రయత్నించినపుడు ఏమాత్రం అదుపుతప్పినా ప్రాణాలు కోల్పోవలసి వస్తుతుంది. అయితే ఇలాంటి ఒక ఘటనే నిన్న చీరాల లో జరిగింది. కాగా ఆ ఘటనకు ప్రకాశం జిల్లా చీరాల ర్తెల్వే స్టేషన్‍లో విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కబోయి నిన్న రాత్రి ఇంజినీరింగ్ విద్యార్థి రైలు కిందపడి మృతిచెందిన సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

విషయం లోకి వెళితే, గుంటూరు జిల్లా బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కె. వెంకటశివ(18) అనే యువకుడు చెన్నెలో జరగనున్న ఎడ్యుకేషనల్ ఫెయిర్‌కు వెళ్ళేందుకు బాపట్ల నుంచి శుక్రవారం అర్ధరాత్రి చెన్నె ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు. చీరాల రైల్వేస్టేషన్‌లో ఆగిన రైలు దిగి మంచినీటి సీసా కొనుక్కోన్నాడు. ఆ క్రమంలో ర్తెలు కదిలింది. అప్పటికే వేగం అందుకున్న ర్తెలు ఎక్కే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు జారి రైలు కిందపడి మృతిచెందాడు. ప్రమాద దృశ్యాలు సీసీ టీవీలో నమోదయ్యాయి. మృతుడు ప్రకాశంజిల్లా దర్సి మండలం కామాంతపూడి గ్రామానికి చెందిన వెంకట శివగా గుర్తించారు. అయితే శివ మృతిపై అతని తల్లితండ్రులకు సమాచారమిచ్చామని రైల్వే పోలీస్ లు చెపుతున్నారు …