చేపలు అమ్ముతూ జీవిస్తున్న విద్యార్థిని : వైరల్ కావడంతో మీడియాపై అసహనం!

Friday, July 27th, 2018, 05:40:45 PM IST

ఎవరి జీవితం ఎలా ఉంటుందో, ఎవరికి ఎటువంటి మలుపులు ఎదురవుతాయి అనేది చెప్పడం కష్టం. అయితే కోందరు మాత్రం కష్టాలు పడుతున్నవారిని చూసి చలించిపోయి తాము కూడా ఏదైనా వారికీ అందివ్వాలని చూస్తే, మరికొందరు మాత్రం అవి ఎంతవరకు నిజమో, అసలు వారివి నిజంగానే కష్టాలా, లేక నటనా అనేది అర్ధంకాక డైలామాలో ఉండిపోతుంటారు. నిజం చెప్పాలంటే మన పక్కవారితో మనం రోజు జీవనం సాగిస్తుంటమే తప్ప వారి జీవితంపై మాత్రం శాసించే అధికారం లేదనేది ఒప్పుకుని తీరవలసిన సత్యం. ఇక అసలు విషయంలోకి వెళితే, కేరళ లోని ఎర్నాకులం ప్రాంతానికి చెందిన 21ఏళ్ళ హాసన్ అనే అమ్మాయి, స్థానిక ప్రైవేట్ కళాశాలలో బిఎస్సి చదువుతోంది. అయితే రోజు ఉదయంపూట కాలేజికి వెళ్లే ఆమె, కాలేజీ అనంతరం హోల్ సేల్ మార్కెట్ లో చేపలు కొనుక్కుని వచ్చి, వాటిని చుట్టుప్రక్కల వీధుల్లో రిటైల్ ధరలకు అమ్ముతూ జీవనం సాగిస్తోంది.

అయితే హాసన్ తల్లి తండ్రులు తాను చిన్నప్పుడే ఇద్దరు విడిపోవడం జరిగింది. తండ్రి తాగుడుకు బానిస అవడంతో తల్లి తండ్రుల మధ్య విభేదాలతో వారు విడిపోయారు. ప్రస్తుతం తల్లితోపాటు ఉంటున్న హాసన్ కుటుంబ పోషణ, ఆర్ధిక సమస్యలవల్ల ఇలా కాలేజీకి వెల్తూ, చేపలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. అయితే ఆమె విషయం కొంతకాలం క్రితం ఆ చుట్టుప్రక్కలి వారి ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆమె పరిస్థితి చూసిన కొందరు ఆమెను చూసి జాలి పడుతుంటే, మరికొందరు మాత్రం అది అంత ఒత్తిడి, ఆమె నాటకాలు ఆడుతోంది అంటూ హేళన చేస్తున్నారు. అదీ కాక ఈ మధ్య ఆమె విషయం, మరియు ఆర్ధిక పరిస్థితి తెలుసుకున్న మంత్రి జేజే అల్ఫోన్స్ కూడా జాలిపడి ఆమెకు మద్దతుగా నిలిచారు. దీనితో కొన్నాళ్ల నుండి తన జీవితం పై ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతుంటే, కొంత ఆవేదన చెందిన హసీన్, మీ అందరికి నమస్కారాలు, దయచేసి నా మానాన నన్ను బ్రతకనివ్వండి, నా కుటుంబ పోశాంర్ధం నేను నాకు తోచిన విధంగా జీవిస్తున్నాను, నా జీవితాన్ని మీదికి ఎక్కించకండి అంటూ వేడుకుంటోంది……

  •  
  •  
  •  
  •  

Comments