గన్ తో కాల్చుకున్న విద్యార్థిని.. కారణం తెలిస్తే షాక్!

Tuesday, April 3rd, 2018, 12:31:15 AM IST

ఇటీవలి కాలంలో పిల్లల్లో సరిగా చదవక పోవడం వల్ల, అలానే సహచర విద్యార్థులు బాగా చదువుతుంటే నువ్వు సరిగా చదవడం లేదని క్లాస్ టీచర్ లు, తల్లి తండ్రులు వేధించడం సరికాదని, కొందరు పిల్లల్లో ఏకాగ్రత స్థాయి తక్కువగా ఉంటుందని, అందువల్ల వారిపై వత్తిడి తేవద్దని మానసిక నిపుణులు తరచు చెప్పడం వింటున్నాం. అయితే ఇటీవల మార్కులు ఎక్కువ రాలేదని, అందువల్ల తాను టాపర్ కాలేకపోయానని ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఉదంతం ఆ ప్రాంత వాసులను తీవ్రంగా కలిచి వేసింది.

వివరాల్లోకి వెళితే, హర్యానాలోని సివాహ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు పరీక్షల్లో ఫస్ట్ రాలేకపోయానని, ఇంట్లో వున్న గన్ తో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థినిని గ్రామ సర్పంచ్ వేద్ పాల్ సింగ్ కుమార్తె అంజలిగా గుర్తించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అఘాయిత్యానికి ముందు తండ్రికి ఫోన్ చేసిన అంజలి త్వరగా ఇంటికి రావాలని చెప్పింది. ఇంటికి చేరకునేసరికే బాత్రూమ్ లో ఆమె విగతజీవిగా రక్తపు మడుగులో పడి ఉంది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. శనివారం పరీక్ష ఫలితాలు విడుదలైన కొద్దిసేపటికే ఆమె ఆత్మహత్య చేసుకుంది.

ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీస్ అధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ, అంజలికి తక్కువ మార్కులేమి రాలేదని ఆమె తల్లిదండ్రులు మాతో చెప్పారు. అయితే వాస్తవానికి ఫస్ట్ రాలేకపోయానన్న బాధతో ఆమె మనస్తాపానికి లోనైందని, తరచు సహవిద్యార్థులు తనకన్నా బాగా చదువుతున్నారని, కానీ తనకి మాత్రం మంచి మార్కులు రావడం లేదని చెప్పుకుని బాధపడేదని చెప్పారు…..