ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ – సుబ్రహ్మణ్యపురం

Friday, December 7th, 2018, 07:26:57 AM IST

సుమంత్ హీరోగా,ఈషా రెబ్బా హీరోయిన్ గా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ట్రైలర్ తోనే ఎంతో ఆసక్తిని నెలకొల్పిన చిత్రం “సుబ్రహ్మణ్యపురం”.రానా వాయిస్ ఓవర్ తో సుబ్రహ్మణ్యపురం అనే ఊరి చరిత్రను తెలుపుతూ టైటిల్స్ తోనే ఆసక్తిని పెంచేశారు.దేవాలయ రహస్యాలను చేధించే వ్యక్తిగా హీరో సుమంత్ కూడా అద్భుతమైన నటన కనబరిచారు.ఆ గ్రామంలో అనుకోని పరిస్థితుల్లో అక్కడి ప్రజలు చనిపోతుంటారు అసలు వారు ఏ కారణం చేత చనిపోతున్నారు అన్నది పెద్ద మిస్టరీగా మారడంతో చిత్రం మీద ఇంకా ఆసక్తిని పెంచుతుంది.కమెడియన్ ఆలీ మరోసారి తనదైన శైలి కామెడీతో మెప్పించారు.

మొదటి రెండు పాటలు కూడా బాగానే మెప్పించాయి.కానీ అసలు సుబ్రహ్మణ్యపురంలోని ప్రజలు ఎందుకు చనిపోతున్నారు,దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి అన్నది ఇంకా తెలీలేదు.అసలు ఆ రహస్యం ఏమిటి అన్నదాని మీద ఆసక్తి పెంచుతూ ఇంటర్వెల్ వచ్చింది.దర్శకుడు మంచి కథనే ఎంచుకున్నా సరే దాన్ని సరిగ్గా తీర్చిదిద్దడంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకొని ఉంటే బాగున్ను.ఎడిటింగ్ కూడా అంతగా ఏమి ఆకట్టుకోలేదు.కానీ మంచి సస్పెన్స్ తో సెకండాఫ్ మీద ఆసక్తి పెంచారు.ఇప్పడు మిగతా భాగం ఎలా ఉంటుందో చూడాలి.పూర్తి రివ్యూ కోసం తెలుగుఇన్.కామ్ వెబ్ సైట్ ను చూస్తూ ఉండండి.