ఉన్నావ్ కేసులో కొత్త ట్విస్ట్ ..మరో ఇద్దరి అరెస్ట్

Friday, May 18th, 2018, 12:13:07 AM IST

కొద్దిరోజుల క్రితం యావత్ భారతదేశం తల దించుకునేలా చేసిన ఉన్నావ్ హత్య కేసులో మరో ట్విస్ట్ ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఈ కేసు నేపథ్యంలో ఇద్దరు పోలీసులను సిబీఐ అధికారులు అరెస్టు చేసి బందీలుగా చేసారు. దేశాన్ని కుదిపేసిన ఈ కేసులో ప్రధాన నిందితుడైన భాజాపా ఎమ్మెల్యే కులదీప్ సింగ్ మరియు అతని అనుచరులైన మరో ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి అదుపులోకి తీస్కున్న సంగతి విదితమే. అయితే ఈ అంశంపై సిబీఐ బలగాలు వారిని విచారణ చేస్తున్న నేపథ్యంలో అత్యాచారానికి గురైన ఆ బాలిక తండ్రిని అన్యాయంగా జైలు పాలు చేసి అతని ప్రాణాలు పోవడానికి కారణమైన ఇద్దరు పోలీసులు కూడా ఈ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించి ఈ పోలీసులు కూడా ముఖ్య కారకులు అని తెలుసుకున్న సిబీఐ బుదవారం వారిని అరెస్టు చేసింది.

అరెస్టు చేసిన ఈ పోలీసుల పేర్లు ఎస్ఐ అశోక్ సింగ్ మరియు ఎస్ఐ ప్రసాద్ సింగ్ లు గా వెల్లడించగా వీరిద్దరిని ప్రస్తుతం సస్పెండ్ చేసి జైల్లో విచారణ చేపట్టింది. అరెస్టు చేసిన వీరిద్దరిని సిబీఐ గురువారం కోర్టులో హాజరు పరచి ఈ జేసులో ఎమ్మెల్యే కులదీప్ సింగ్ కు సహాయం చేసినందుకు గానూ, దొంగ సాక్ష్యాదారాలను పుట్టించి కేసును తారుమారు చేసినందుకు గాను అన్ని రుజువులను బయటికి లాగి కేసులో చిక్కుకున్న ప్రతీ ఒక్కరికీ శిక్ష పడేలా చూస్తామన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments