సైరా స్టిల్: వావ్.. సుదీప్ లుక్ అదిరింది!

Saturday, September 1st, 2018, 06:46:13 PM IST

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా సైరా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజైన టీజర్ కి కూడా భారీ స్థాయిలో ఆదరణ దక్కింది. ఇకపోతే సినిమాకు సంబందించిన పాత్రలను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

మొదటగా క‌న్న‌డ అభిన‌య చ‌క్ర‌వ‌ర్తి సుదీప్‌ యొక్క ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. అవుకు రాజు పాత్ర‌లో సుదీప్ కనిపించనున్నాడు. చూస్తుంటే ఒక యోధుడి పాత్రలో సుదీప్ కూడా విజిల్స్ వేయించేలా ఉన్నాడని తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ 2న సుదీప్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అవుకు రాజు గా సుదీప్ లుక్‌ను విడుదల చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు వంటి నటీనటులు సినిమాలో కీలకపాత్రల్లో నటించనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments