వీడియో : కుర్చీలతో చితక్కొట్టుకున్న విద్యార్థులు.. స్పాట్ డెడ్!

Monday, February 12th, 2018, 07:50:05 PM IST

చిన్నపాటి వివాదాలకు కొంత మంది చేస్తోన్న అల్లర్ల వల్ల ప్రాణాలు పోతున్నాయంటే ఒక్కసారి నమ్మాలని అనిపించదు. అయితే ఈ మధ్య కాలేజ్ గొడవల వల్ల పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతున్నాయి. గుంపులు గుంపులుగా చేరి గొడవలు పడుతుండడంతో అందరికి గాయాలు అవుతున్నాయి. రీసెంట్ గా అదే తరహాలో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక ఘటన అందరిని షాక్ కి గురి చేసింది. ఏ మాత్రం ఆలోచించకుండా రెండు గ్రూపుల విద్యార్థులు ఇష్టం వచ్చినట్లు ఓ హోటల్ లో కుర్చీలతో కొట్టుకున్నారు. ఘటనలో ఒక విద్యార్థి తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. ఘటనం మొత్తం సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. అయితే ఘటనకు గల పూర్తి వివరాలను పోలీసులు కనుగొనే పనిలో పడ్డారు.