సుహాసిని పొలిటికల్ ఎంట్రీ.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ పై బాలకృష్ణ సంచ‌ల‌నం..!

Saturday, November 17th, 2018, 01:25:10 PM IST

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. మ‌హాకూట‌మిలో భాగంగా టీడీపీ శత్రువైన‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌ర్చిన చంద్ర‌బాబు.. టీడీపీ కంచుకోట అయిన కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క వ‌ర్గంలో.. నంద‌మూరి ఫ్యామిలీ నుండి దివంగత నేత హరికృష్ణ కుమార్తె, సుహాసినికి టిక్కెట్ ఇచ్చి ఒక్క‌సారిగా తెలంగాణ ప్ర‌జ‌ల దృష్టిన త‌న‌వైపుకు తిప్పుకున్నారు.

ఈ నేప‌ధ్యంలో తాజాగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతోన్నసుహాసిని శనివారం నామినేషన్ దాఖలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… తెలంగాణలో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో కాంగ్రెస్ నేత‌ల‌తో వేదిక‌ల‌ను పంచుకొని మ‌హాకూట‌మి త‌రుపున ప్ర‌చారం చేస్తాన‌ని.. నాడు ఎన్టీర్, చంద్ర‌బాబులు చేసిన అభివృద్ధిని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మ‌రోసారి గుర్తు చేస్తాన‌ని బాల‌య్య స్ప‌ష్టం చేశారు. ఇక సుహాసిని కోసం ప్ర‌చారం చేయ‌డానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌స్తారా అని ప్ర‌శ్నించ‌గా.. ఎవ‌రి ఇష్టం వారిద‌ని చెప్పి బాల‌య్య స‌మాధానాన్ని దాట‌వేశారు. నంద‌మూరి ఫ్యామిలీ నుండి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుహాసినికి తెలుగు ప్ర‌జ‌ల ఆశీస్సులు కావాల‌ని బాల‌కృష్ణ కోరారు.