ఇంట్లో పెళ్లి ఊరిబయట శవం..

Monday, May 14th, 2018, 11:51:52 AM IST

సమాజంలో జరుగుతున్నకొన్ని వైవిధ్యమైన ప్రేమ పెళ్ళిల్లను చూస్తూ తమ పిల్ల భవిష్యత్తు ఏమయిపోతుందన్న భయంతో కొందరు తల్లిదండ్రులు చాలా ప్రాంతాలలో చాలా దారుణంగా ఇష్టం లేని వాళ్లకి కట్టబెట్టి గొంతు కోసినంత పని చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి నల్గొండ జిల్లా, చందంపేట మండలంలో చిత్రియాల పరిదిలోని వెంకటిగాని తాండలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇష్టంలేని పెళ్లి చేసేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు, అక్క బావాలకు దారుణమైన విషాదం ఒకటి ఎదురైంది. అన్ని మాట్లాడుకొని పెళ్ళికి సిద్దమవగా తీరా పెళ్లి సమయ వచ్చేసరికి పెళ్ళికుమారుడు పారిపోయాడు. ఎక్కడ పరువుపోతుందన్న భయంతో ఆ యువతికి అదే సమయంలో మరొక యువకునితో పెళ్లి జరిపించాల్సి వచ్చింది.

పరారీలో ఉన్న యువకుడు తరువాతిరోజు శవమై కనిపించగా ఇరు కుటుంబాలలో తీరని విషాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం నేనావత్ చంద్రు, ఇచ్చాలి దంపతుల కుమారుడు నేనావత్ హరిలాల్ తో, తెల్తేవరపల్లి ఆవాసం మేత్య తాండాకు చెందన దశరథం, తారి దంపతుల కుమార్తె లక్ష్మికు ఇద్ది పెళ్లి జరిపిచేందుకు పెద్దలు నిశ్చయించారు. మొదటినుండి లక్ష్మిని పెళ్ళి చేస్కోకోవడానికి ఇష్టం లేకపోవడంతో పెద్దలు అతని మాటలను పట్టించుకుండా అతనికి బలవంతపు పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు. తన బాధ ఎవరు పట్టించుకోవదని ఆందోళన చెందినా హరిలాల్ శనివారం ఇంటినుంచి పరారై తిమ్మాపురం గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం హరిలాల్ మృతదేహం బయట పడటంతో పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించగా అతని కుటుంబీకులు మాత్రం ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని ఏఎస్సై వెల్లడించారు.