బాంబుతో సహా పేల్చుకోబోయిన యువతి.. ముందే పసిగట్టిన భారత్!

Saturday, January 27th, 2018, 03:15:28 AM IST

ప్రస్తుత రోజుల్లో ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి భారత సైనిక దళాలు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ప్రమాద హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే గణతంత్ర దినోత్సవం నాడు కొన్ని ఉగ్రవాద సంస్థలు భారత్ ను టార్గెట్ చేశాయి. ఈ విషయంపై గత కొంత కాలంగా కేంద్ర సెక్యూరిటీ విభాగానికి సమాచారం అందుతూనే ఉంది. అయితే ఎక్కడా వెతికినా కుట్ర పన్నుతోన్న ఉగ్రవాదుల ఆనవాళ్లు దొరకలేవు. అయితే ఇంటిలిజెంట్స్ నుంచి రీసెంట్ గా సమాచారం అందకపోయి ఉంటె అక్కడ పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. మానవబాంబు రూపంలో మృత్యువు వందల సంఖ్యల అమాయకుల ప్రాణాలను భలి తీసుకునేది.

అసలు వివరాల్లోకి వెళితే..జమ్మూ కాశ్మీర్ లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాది (యువతి)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతీ అమర్చుకున్న బాంబును జనాల గుంపులో పేల్చుకుందామని అనుకుంది. గణతంత్ర దినోత్సవ సందర్బంగా కశ్మీర్‌లోని రిపబ్లిడే పరేడ్‌ వద్ద ఈమె ఆత్మహుతి దాడికి సిద్దపడింది. అయితే రెండు రోజుల ముందు కశ్మీర్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇంటిలిజెన్స్ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా గురువారం రాత్రి ఆమె పోలీసులకు చిక్కింది. గత కొంత కాలంగా ఆమె ఉగ్రవాదులతో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.