అప్పు తీర్చలేక భయంతో ఆత్మహత్య !

Tuesday, April 24th, 2018, 02:35:19 PM IST

ఇటీవల పలు రకాల కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని అక్కడక్కడా మనం చూస్తున్నాం. వీటికి చిన్న పెద్ద అని తేడా లేకుండా పోయింది. మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు, సరిగా చదవలేకపోతున్న అని ఒకరు, చుట్టుప్రక్కలవారు తనతో సరిగా మాట్లాడడంలేదని ఒకరు, ప్రేయసి ప్రేమించడం లేదని ఒకరు, భార్య చెప్పిన మాట వినలేదని మరొకరు ఇలా చెప్పుకుంటూ పోతే అర్ధం పర్ధం లేని ఇలాంటి చిన్న చిన్న కారణాలతో నిండు నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల కొత్తగా పెళ్లి అయిన ఒక యువకుడు కూడా ఇలానే బలవన్మరణానికి పాల్పడ్డాడు. విష్యం లోకి వెళితే, హైదరాబాద్ కంచం బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బుక్స్ బైండింగ్ చేసే వృత్తి లో వున్న జలాలుద్దీన్ గత మార్చిలో ఒక వంట చేసే వ్యక్తి దగ్గర రూ.20 వేలు అప్పుగా తీసుకుని ఆ సొమ్ముని పెళ్లి ఖర్చులకు వినియోగించాడు.

అయితే అప్పటినుండి అతను చెల్లించవలసిన బాకీ చెల్లించలేక నానా అవస్థలు పడసాగాడు. అయితే నిన్న అప్పు నిమిత్తం వంటలు చేసే వ్యక్తి ఫోన్ చేసి గట్టిగా అడగడంతో, ఇంట్లోనే వున్న అతను, నేను ఇంట్లో లేను వేరే ఊరులో వున్నాను అని అబద్దం చెప్పాడు. దానికి అతను, పర్లేదు నువ్వు ఊరు నుండి తిరిగివచ్చే వరకు మీ ఇంటిదగ్గరే వుంటాను, వచ్చాక అప్పు వసూలుచేసుకు మరీ వెళతాను అని గట్టిగా చెప్పగానే, ఒక్కసారి భయకంపితుడైన జలాలుద్దీన్ తన ఇంట్లో వున్న ఫ్యాన్ కు దుప్పటితో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కాసేపటికి ఇంటికి వచ్చిన అతని భార్య తలుపులు తెరిచి చూడగా అతను మరణించి వున్నాడు. ఉన్నపళంగా 108 అంబులెన్సు కు ఫోన్ చేసి పిలిపించినప్పటికీ అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఈ విషయమై తమకు ఎవరిమీద ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీస్ లు చెపుతున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments