సుజ‌నా బ్యాంకుల్ని ఎందుకు మోసం చేశావ్‌?

Saturday, January 28th, 2017, 12:23:04 AM IST

pk
జ‌న‌సేనాని లైవ్‌లో దంచేస్తున్నాడు. అధికారంలో ఉండి హోదాని మంట గ‌లిపిన ద‌గుల్బాజీల్ని పేరు పెట్టి పిలిచి మ‌రీ ఏకేస్తున్నాడు. ముఖ్యంగా త‌న‌ని విమ‌ర్శించిన సుజ‌నా చౌద‌రికి ఓ రేంజులో పంచ్‌లేశాడు. మాడు ప‌గ‌ల‌గొట్టాడు. సుజ‌నా బ్యాంకు రుణాలు ఎందుకు రీపే చేయ‌లేదు? అంటూ ప్ర‌శ్నించాడు ప‌వ‌న్‌. జ‌ల్లిక‌ట్టు మాట ప్ర‌స్థావిస్తూ ..ప‌ందుల పందేలు, కోడిపందేలు ఆడుకోండి అంటారా? ఇదేనా మాట్లాడే విధానం? అంటూ సుజ‌నాపై ఫైర‌య్యారు ప‌వ‌న్‌. అయినా ఏ స్ఫూర్తితో బ్యాంకుల్ని మోసం చేశారు? రుణాలు ఎగ్గొట్టారు? ఇది అడిగితే మీకెలా ఉంటుంది? అంటూ ప్ర‌శ్నించాడు. ఇన్ని లోపాల్ని పెట్టుకుని ప్ర‌జ‌ల్ని అనే హ‌క్కు మీకు ఎక్క‌డుంది. వీలుంటే స్టేట్ కోసం, ప్ర‌జ‌ల కోసం పోరాడండి కానీ వెన‌కాడ‌కండి. ఇది క‌రెక్ట్ కాదు.. అంటూ సుజ‌నా నీతిని ప్ర‌శ్నించాడు. రాయ‌పాటి, సుజ‌నా అంటే గౌర‌వ‌మే.. శ‌త్రుత్వం లేదు… అంటూనే వివాదాస్ప‌ద మంత్రులు ప్ర‌జ‌ల‌కేం చేస్తారులే అని పెద‌వి విరిచేశాడు ప‌వ‌న్‌.