రంగస్థలం కాపీ కాదు.. అతను ఎవరో తెలియదు: సుకుమార్

Tuesday, May 29th, 2018, 11:06:21 AM IST

సమ్మర్ లో మొదట బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను స్టార్ట్ చేసి భారీ హిట్ అందుకున్న చిత్రం రంగస్థలం. రామ్ చరణ్ కెరీర్ లోనే ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రంగస్థలం సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ అందరికి ఎక్కువగా నచ్చిందని చెప్పాలి. అయితే ఎవరు ఊహించని విధంగా సినిమా క్లైమాక్స్ సీన్స్ పై ఇటీవల ఒక రచయిత ఆరోపణలు చేశారు. అంతే కాకుండా తెలుగు రచయితల సంఘానికి పిర్యాదు చేశాడు.

ఎం.గాంధీ అనే రచయిత రంగస్థలం క్లైమాక్స్ లో ఉన్న కథాంశం మొత్తం తనదే అని కాపీ కొట్టి సుకుమార్ తెరకెక్కించారు అని పిర్యాదు చేయడంతో సుకుమార్ వెంటనే ఆ విషయంపై వివరణ ఇచ్చాడు. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదు. ఎప్పుడు చూడలేదు కూడా.. రంగస్థలం క్లైమాక్స్ సీన్స్ పాత సినిమాలను బేస్ చేసుకొని చిత్రీకరించాను. చాలా సినిమాల్లో అలాంటి ముగింపు ఉందని తాను దానిని కొత్తగా రాశాను అని చెప్పారు. దీంతో రచయితల సంఘం సంతృప్తి చెంది ఆరోపణలు చేసిన రచయితకు సమాధానం ఇచ్చింది. ఇంకా అనుమానాలు ఉంటే కోర్టుకు వెళ్ళమని చెప్పినట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments