దత్తత తీసుకోవడం ఆనందంగా ఉంది : సుమ – రాజీవ్

Tuesday, September 18th, 2018, 04:50:07 PM IST

వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు దేశమంతా సహాయంగా నిలిచిన సంగతి తెలిసిందే. సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు వారికి తోచినంత సహాయాన్ని అందించారు. ఇకపోతే ప్రస్తుతం కేరళ ప్రభుత్వం మరోసారి సహాయాన్ని కోరుతోంది. ఇకపోతే ఎక్కువగా వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతం గాలిప్పి. ఆ ప్రాంతంలో భవనాలు చాలా వరకు దెబ్బ తిన్నాయి. ఎంతో మందికి ఆశ్రమం కల్పిస్తున్న ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ కూడా నష్టపోయింది.

దాన్ని బాగు చేయించేందుకు ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల యాంకర్ సుమ ముందుకు వచ్చారు. భవనం పునర్నిర్మాణం కోసం తాము కృషి చేస్తామని తెలిపారు. సొంత ఖర్చులతో భవనం కోసం కావాల్సిన అవసరాలన్నీ సుమ దంపతులు అందించనున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం గురించి తెలియజేసిన సబ్ కలెక్టర్ గారికి ఈ సినీ ప్రముఖులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ.. ఈ విధంగా ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన భవనాలను దత్తతకు తీసుకొని కార్యక్రమంలో బాగస్వామ్యులవ్వాలని అందరిని కోరుకుంటున్నట్లు సుమ వివరించారు.