కేసీఆర్‌కి స‌పోర్ట్‌.. చంద్ర‌బాబుపై సెటైర్‌?

Wednesday, April 4th, 2018, 10:24:03 PM IST


గ‌త కొంత‌కాలంగా హీరో సుమ‌న్ రాజ‌కీయారంగేట్రం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్నార‌ని అటు ఏపీ, లేదా ఇటు తెలంగాణ‌లో ఏదో ఒక చోట పోటీ చేసే ఆలోచ‌న ఉంద‌ని యాక్టివిటీ చెబుతోంది. అయితే అత‌డికి సీటిచ్చేదెక్క‌డ‌? అన్న‌ది ఆస‌క్తిక‌రం. కొంత‌కాలంగా సుమ‌న్ మాత్రం ఎడ‌తెరిపి లేకుండా అటు ఏపీ రాజ‌కీయాల్ని, ఇటు తెలంగాణ రాజ‌కీయాల్ని ట‌చ్ చేస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. నేడు ఓ ఇంట‌ర్వ్యూలో సుమ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చాయి.

తెలంగాణ గురించి సుమన్‌ మాట్లాడుతూ .. సీఎం కేసీఆర్ చాలా క్వాలిటీ సీఎం అని పొగిడేశారు. భార‌త‌దేశ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నా. దీనిపై కేసీఆర్‌ని క‌లిసి అడుగుతాన‌ని అన్నారు. ఆంధ్రా-తెలంగాణ అనుబంధం కొన‌సాగాల‌ని ఈ సంద‌ర్భంగా ఆకాంక్షించారు. ఏపీ హోదా గురించి మాట్లాడుతూ “ఏపీలో అరిస్తే హోదా రాదు.. దిల్లీ వెళ్లి అర‌వాల“ని వ్యాఖ్యానించారు. ప్ర‌త్యేక హోదా గురించి అంద‌రికీ చెప్పాలి. ప్యాకేజీ గురించి ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి.. ప్ర‌త్యేక హోదా మార్కెట్లో అమ్మే వ‌స్తువు కాద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.