కోహ్లీ కూడా మనిషే!

Tuesday, September 4th, 2018, 06:40:40 PM IST

ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా మూడు సార్లు సిరీస్ కోల్పోయిన జట్టుగా భారత్ నిలిచింది. మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే 1-3 తేడాడో విరాట్ సేన ఓటమి చెందింది. అయితే ఈ సిరీస్ లో విరాట్ తప్పితే ఎవరు అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. ప్రతిసారి విరాట్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను గెలిపించడానికి ప్రయత్నం చేశాడు. గత మూడు టెస్టుల సిరీస్ లలో చుస్తే కూడా భారత్ ఓటమి చెందినప్పటికీ కోహ్లీ బాగానే కష్టపడ్డాడు.

ఈ సిరీస్ లో కోహ్లీ నాలుగు టెస్టుల్లో మొత్తంగా 544 పరుగులు చేశాడు. నిజంగా కెప్టెన్ గా తన బాధ్యతను కరెక్ట్ గా నిర్వర్తించాడని అయితే ప్రతిసారి కోహ్లీ ఒక్కడే ఆదుకోలేడని పలువురు సీనియర్ క్రికెటర్స్ వివరణ ఇచ్చారు. అయితే విరాట్ పై కొన్ని విమర్శలు వస్తున్నవేళ గవాస్కర్ అందుకు భిన్నంగా స్పందించి అతనికి మద్దతుగా నిలిచాడు. కోహ్లీ చాలా మంచి ఆటతీరును కనబరిచాడు. అయిదుగురు స్ట్రాంగ్ బ్యాట్స్ మెన్ లైన్ ఉన్నప్పుడు కోహ్లీపైనే ఆధారపడటం ఎందుకు? కోహ్లీ సరైన సమయంలో శతకాలు సాధించాడు. కానీ ప్రతిసారి అతను అలా చేయలేడు. ఎందుకంటే అతను మనిషే అని గవాస్కర్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments