పంటపొలాల్లో సన్నీ హొయలు.. లాభాల్లో రైతన్నలు!!

Thursday, March 1st, 2018, 06:00:32 PM IST

నెల్లూరు పంట పొలాల్లో సన్నీ లియోన్ సందడి చేస్తుంది. ఏంటి బాలీవుడ్ ని వదిలి పంటపొలాల్లో ఏం చేస్తుందనుకుంటున్నారా..? లాభాలు లేక నరదిష్టి పడి కుంగిపోతున్న రైతన్నలకు ఆసరాగా నిలిచింది. సిల్వర్ స్క్రీన్ పై కుర్రకారును కేకలు పెట్టించిన సుందరి సన్నీ లియోన్ నెల్లూరు జిల్లాలోని రైతులకు పశుపక్షాదులను దరికి చేరనియని పంట కాపరిగా, ఎవరి కన్ను పంటపై పడకుండా అన్ని భారాలను మోసే వరాలమూటగా మారింది. తమ పైరులకు నరదిష్టి తగిలి పంటలు నాశనమైపోతున్నాయని బాధ పడుతూ.. ఇక్కడి రైతులు ఇలాంటి కొత్త ఐడియాకు తెరలేపారు. మొదట్లో ఒకరిద్దరు ఈ ఐడియా పాటించగా ఇప్పుడు అందరూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

వారి వారి పంట పొలాలపై ఇతరుల దృష్టి పడకుండా సన్నీ హాట్ హాట్ ఫ్లెక్సీలను పొలాల గట్ల దగ్గర, అమర్చారు. దీని వల్ల రైతులకు నరదిష్టి నుంచి ఉపశమనం కలుగుతుందని పద్దతి పాతదే అయినా కొత్త ఐడియాలతో ట్రెండు సృష్టించాలని ఈ ప్రయత్నం చేసామని రైతులు అన్నారు. నెల్లూరు జిల్లా, నాయుడుపేట మండలం, కాపులూరు, పూచివాడ, చిలమత్తూరు గ్రామాల్లోని పలు పంట చేళ్లకు దిష్టి తగలకుండా సన్నీలియోన్ ఫ్లెక్సీలను పెట్టారు. అందాల సుందరీ, దిష్టి సుందరిగా మారడంపైనే చుట్టూ పక్కల వాళ్ళంతా తెగ చర్చించుకుంటున్నారు. ఇలాగే ఉంటే కొద్ది రోజుల తర్వాత సన్నీ లియోన్ రూపంలో ఉన్న రోబోలు వస్తే అవికూడా పొలంలో తిరగడానికి పెట్టేలా ఉన్నారు కదా మరి…