” గతంలో తప్పు చేశాను..” ఆ మచ్చ ఎన్నటికీ పోదు : సన్నీ లియోన్

Saturday, May 26th, 2018, 06:30:20 PM IST

నీలి చిత్రాల ద్వారా ఎంతగానో పాపులర్ అయిన సన్నీ లియోన్ ఆ తరువాత ఇండియాకు వచ్చి సినిమాలతో లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే సన్నీ గతం గురించి ఎవరు ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. సన్నీ ఒక మంచి మనసున్న అమ్మాయిలా మారిందని ఆమె ఒక చిన్నారిని దత్తత తీసుకోవడం గొప్ప విషయమని పలువురు పొగిడారు. సన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ లెవెల్లో ఉందొ అందరికి తెలిసిందే.

ఇకపోతే సన్నీ ఇటీవల తన గతాన్ని తలచుకొని బావోద్వేగంగా ట్వీట్ చేసింది. అయితే రీసెంట్ గా సన్నీ లియోన్ బయోపిక్ రిలీజ్ అయ్యింది. కరణ్‌ జిత్‌ కౌర్- ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ అనే పేరుతో రిలీజ్ చేయగా అది చూసిన సన్నీ ఎంతో ఆవేదనకు లోనయ్యిది. డాక్యుమెంటరీ చూస్తుంటే నా కన్నీరు ఆగలేదు. నా హార్ట్ కొన్ని వేలసార్లు ముక్కలైంది. గతంలో ఆ చిత్రాల్లో నటించడానికి ముందు ఏ విధంగా ఉన్నానో మళ్లీ అదే లైఫ్ కావాలని అనిపిస్తోంది. అది జరిగితే బావుందని కోరుకుంటున్నా. కానీ ఆ రోజులు మళ్లీ రావడం సాధ్యం కాదు. నా గత వ్యక్తిత్వం ఎప్పటికి అలానే గుర్తుంటుంది. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశానని సన్నీ లియోన్ బాధపడుతూ ట్వీట్ చేసింది.

  •  
  •  
  •  
  •  

Comments