మళ్లీ చితక్కొట్టిన సన్ రైజర్స్

Friday, May 11th, 2018, 12:33:19 AM IST

హైదరాబాద్ టీమ్ సన్ రైజర్స్ మరోసారి తన సత్త చాటింది. వరుసగా ఆరవ విజయంతో రికార్డ్ సృష్టించింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ తో పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చూస్తుంటే సన్ రైజర్స్ ఈ సారి కప్పు కొట్టేలా ఉందనిపిస్తోంది. మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసి 188 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(9), జాసన్‌ రాయ్‌(11) లు తొందరగా అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన రిషబ్‌ పంత్‌ సన్ రైజర్స్ బౌలర్లను ఓ అట ఆదుకున్నాడు. 63 బంతుల్లో 128 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. 15 ఫోర్లు, 7 సిక్సర్లతో ధాటిగా ఆడాడు. దీంతో స్కోర్ 188కు చేరుకుంది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ టీమ్ మొదట్లోనే అలెక్స్ వికెట్ కోల్పోయిన ఆ తరువాత కెప్టెన్ విలియంసన్ (80) – శిఖర్ ధావన్ (92) జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ బౌలర్లు ఎంత కష్టపడినప్పటికీ హైదరాబాద్ బ్యాట్స్ మెన్ లు ఏ మాత్రం కట్టడి చేయలేకపోయారు. తప్పటడుకు వేయకుండా అవసరమైన సమయంలో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు ధావన్, విలియంసన్. ఒక ఓవర్ మిగులుండగానే 189 పరుగులు చేసి 9 వికెట్లతో విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కి వెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది. ఇక ఢిల్లీ దాదాపు ఇంటి బాట పట్టె విధంగా అపజయాన్ని ముఠ గట్టుకుంది.

Comments