వీడియో : సన్ రైజర్స్ ధనాధన్ దంచి కొట్టు హైలైట్స్

Tuesday, April 10th, 2018, 04:26:14 PM IST

సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. కేన్ విలియమన్స్ సారథ్యంలోని రైజర్స్ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని రంగాల్లో సత్తా చాటి లీగ్‌ను గొప్పగా మొదలెట్టింది. తొలుత పర్యాటక జట్టు రహానె సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టును రైజర్స్ బౌలర్లు 125 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్ శిఖర్ ధావన్(77 నాటౌట్) ధానధన్ బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. దీంతో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేత ధావన్ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో బౌండరీలు బాది సన్‌రైజర్స్‌ను గెలుపు బాటలో నడిపించాడు. విలియమ్సన్(36 నాటౌట్) జోడీగా రెండో వికెట్‌కు 121 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ధావన్ బౌండరీతో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. తొలి ఓవర్‌లోనే మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్ పట్టిన రెండు క్యాచ్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి. తొలి ఓవర్ చివరి బంతికి లేని పరుగు కోసం ప్రయత్నించిన ఓపెనర్ షార్ట్‌ను విలియమ్సన్ రనౌట్ చేసిన తీరు అద్భుతం. ఇలా ఈ మ్యాచ్‌కు సంబంధించిన హైలెట్స్ వీడియోలో చూడండి.

  •  
  •  
  •  
  •  

Comments