వైరల్ వీడియో: స్టెప్పులేసిఅలరించిన సూపర్ స్టార్..!

Sunday, February 10th, 2019, 09:42:07 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య , ప్రముఖ నటుడు విశాగన్ ల వివాహ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత్ లో రజినీకాంత్ ముత్తు సినిమాలోని పాటకు స్టెప్పులేసి అలరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, దానిని చుసిన అభిమానులు వింటేజ్ రజినీని గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవల విడుదలై రజినీకాంత్ సినిమా పేటలో కూడా అభిమానులకు వింటేజ్ రజినీని గుర్తు చేసాడు సూపర్ స్టార్, దీంతో రజిని గతచిత్రం మిగిల్చిన నిరాశ నుండి ఆయన అభిమానులు బయటపడ్డారు.

మొత్తానికి తనదైన స్టైల్లో స్టెప్పులేసి అటు వివాహానికి వచ్చిన అతిధులను మాత్రమే కాకుండా సొషల్ మీడియా సాక్షిగా అభిమానులను కూడా ఆనందింపజేశారు. ఇటీవలి కాలంలో సినిమాల్లో పాటలకు డ్యాన్స్ చేయటం తగ్గించిన రజిని, ఈ రకంగా అయినా తన అభిమానులకు ఆ లోటును తీర్చారు.