‘రైతుబిడ్డ’ గా సూపర్ స్టార్ మహేష్!

Sunday, June 3rd, 2018, 08:10:22 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎన్నడూ లేనంత ఆనందంగా వున్నారు. శ్రీమంతుడు చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ భరత్ అనే నేను తో మరొక సారి తన కలెక్షన్ల స్టామినాని బాక్స్ ఆఫీస్ కి రుచిచూపించిన మహేష్, ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి స్పెయిన్ లో విహారయాత్రలో ఆనందంగా గడుపుతున్నారు. ఇక హీరోగా ఆయన నటించబోయే ప్రతిష్టాత్మక 25వ చిత్రం షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం ఆగష్టు లో మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు మొదటి షెడ్యూల్ డెహ్రాడూన్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోది. ఈ చిత్రం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు తన టోటల్ స్టైల్ మరియు మేక్ ఓవర్ లో పూర్తిగా మార్పులు చేర్పులు తగు ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇక అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంలో ఆయన ఒక వ్యవసాయ కుటంబాలోని వ్యక్తిగా కనిపించనున్నారని, అయన తండ్రి సహా తాను కూడా ఒక రైతుగా చిత్రంలో కనిపించనున్నారట. మొదటి అర్ధభాగంలో కాస్త క్లాస్ టచ్ తో కనిపించిన ఆయన రెండవ అర్ధభాగంలో పూర్తి స్థాయి రైతుబిడ్డగా మాస్ పాత్రలో అలరించనున్నట్లు సమాచారం. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడేవరకు వేచివుండవలసిందే మరి. దిల్ రాజు, సి అశ్వినిదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా డీజే చిత్ర నటి పూజ హెగ్డే ఆయన సరసన హీరోయిన్ గా నటించనుంది…..