అంబానీ కూతురు డ్యాన్సు ఇరగదీసింది కదా..

Monday, May 14th, 2018, 02:39:54 PM IST

ప్రస్తుత కాలంలో భారతదేశంలో అధిక సంపన్నులలో మొదటి స్థానంలో ఉన్నది ఎవరంటే టక్కున చెప్పగలిగే పేరు ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ. ఇదిలా ఉంటే తాజాగా అనిల్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఈశాకు.. పిరమాల్‌ సంస్థల వారసుడు ఆనంద్‌ పిరమాల్‌తో వివాహ నిశ్చితార్థం అయిన సంగతి విదితమే. అయితే ఈనెల 7న ముంబయిలో ఓ ప్రముఖ హోటల్ లో ఘనంగా జరిగిన ఈ వేడుకలో ముఖేశ్‌, నీతాలు చిందులు వేసి తమ ఆనందాన్ని కుటుంబీకులతో సరదాగా షేర్ చేసుకున్నారు. ఆ దేడుకలకు సంబందిచిన వీడియో ఒకటి ప్రస్తుత సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చాలా అయింది. అయితే అదే రోజు ఈశా కూడా తన తల్లితో కలిసి స్టెప్పులు వేసింది. అంతేకాకుండా ఈశా తన వదిన, ఆకాశ్‌ అంబానీకి కాబోయే భార్య శ్లోకా మెహతాతో కలిసి ‘పద్మావత్‌’లోని ‘ఘూమర్‌’ పాటకు డ్యాన్స్‌ చేసింది. వదినా మరదళ్లు డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం ఇంకా వైరల్‌ అవుతోంది.

డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు ఈశా-శ్లోకాల సమన్వయం బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇక్కడ ఇచ్చిన వీడియోలో రెడ్ కలర్ లెహంగాలో శ్లోకా మెరిగిపోగా, ఐవర్‌ రంగు లెహంగాలో ఈశా జిగేల్‌ మనిపిస్తోంది. అయితే పిరమాల్‌ సంస్థ అధినేత అజయ్‌ పిరమాల్‌ కుమారుడు ఆనంద్‌ ఇటీవల మహాబలేశ్వర్‌లోని ఓ ఆలయంలో ఈశాతో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఆమె అందుకు ససేమీరా ఒప్పుకుంది. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు కూడా అంగీకారం తెలిపి వివాహ నిశ్చితార్థం ఘనంగా చేశారు. వీరి వివాహం ఈ ఏడాది డిసెంబరులో జరగనున్నట్లు మీడియా ద్వారా వచ్చిన సమాచారం. అయితే ఇటీవలే ఈశా కవల సోదరుడు ఆకాశ్‌ అంబానీ వివాహం కూడా నిశ్చయమైన విషయం తెలిసిందే. ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్‌ మెహతా కూతురు శ్లోకా మెహతాతో ఆకాశ్‌ వివాహ నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. వీరిద్దరి వివాహం కూడా డిసెంబరులోనే జరగనుంది. ఇంకా ఇంకేముంది ఒకే ఇంట అన్ని పెళ్ళిళ్ళ సందడి కావడం నిజంగా అదృష్టం అనే చెప్పుకోవాలి.

  •  
  •  
  •  
  •  

Comments