‘రంగస్థలం’ అద్భుతం అంటున్న ‘సూపర్ స్టార్’

Saturday, April 7th, 2018, 02:20:35 AM IST

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా రంగస్థలం. విడుదలయిన ప్రతిచోటా పాజిటివ్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతోంది. అటు సుకుమార్, ఇటు రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా దూసుకుపోతోంది. అలానే ఈ సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. మార్చి 30న విడుదలైన ఈ చిత్రంపై పరిశ్రమలోని అందరి దగ్గర నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేరారు. రంగస్థలం సినిమాలో రామ్‌చరణ్‌‌, సమంత అద్భుతంగా నటించారని ఆకాశానికి ఎత్తేశారు. వారి కెరియర్ లో ఇది అత్యుత్తమ ప్రదర్శనగా ఉంటుందని మహేష్‌ బాబు తన ట్వీటర్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా దర్శకుడు సుకుమార్ తనదైన శైలిలో సినిమాని తెరకెక్కించాడని మహేష్ అన్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ ఇచ్చాడని అందులో పేర్కొన్నారు. రత్నవేలును కూడా మహేష్‌ ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌ సీస్‌లోనూ రికార్డ్ కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప‍్తంగా విడుదలైన మూడు రోజులకే వందకోట్ల గ్రాస్‌ను సాధించి సత్తా చాటి, అతిపెద్ద హిట్ దిశగా సాగుతోంది……