వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.!

Thursday, September 27th, 2018, 06:15:59 PM IST

సుప్రీం కోర్టు ఈ రోజు భారతదేశంలో సెక్షన్ 497 వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించే తీరు పట్ల చారిత్రాత్మక నిర్ణయాన్ని తీర్పిచ్చింది.ప్రస్తుతం గడుస్తున్న రోజుల్లో వివాహం అనంతరం స్త్రీ లేదా పురుషుడు వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నారన్న వార్తలని తరచూ వింటూనే ఉంటాం.ఇప్పుడు ఇలాంటి సంబంధాల పట్ల సెక్షన్ 497 ను సుప్రీం కోర్టు రద్దు చేసింది.

అయితే ఈ సంబంధాలు తీవ్ర రూపం దాల్చితే మాత్రం శిక్ష తప్పదు అంటున్నారు,విహాహం అనంతరం ఒక పురుషుడు ఆమె భర్త యొక్క అనుమతి తీసుకొని వివాహేతర సంబంధం కొనసాగిస్తే అది నేరం కాదని తీర్పు ఇచ్చింది.ఈ వివాహేతర సంబంధాలకు పాల్పడిన స్త్రీకి మాత్రం ఎలాంటి శిక్ష ఉండదని తెలిపింది,స్త్రీ సమ్మతితో శృంగారం చెయ్యడం రాజ్యాంగ విరుద్ధం అని తెలియజేసింది.అంతే కాకుండా వివాహేతర సంబంధాల్లో స్త్రీ పురుషులు ఇద్దరికీ సమాన హక్కులుంటాయని తెలియజేసింది.