అయోధ్య భూ వివాదం కేసు వాయిదా..న్యాస్ వివాదాస్పద వ్యాఖ్యలు

Tuesday, December 5th, 2017, 05:03:04 PM IST

గత కొన్నేళ్లుగా అయోధ్య భూ వివాదంపై కేసులు ఏ స్థాయిలో చెలరేగుతున్నాయో అందరికి తెలిసిందే. అయితే నేడు కేసుపై ఎలాంటి తీర్పు వస్తుందో అని అందరు ఎదురుచూశారు. కానీ సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8కి కేసు పై విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వాయిదా పడిన నేపథ్యంలో పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామజన్మభూమి న్యాస్‌ మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ మరోసారి ఎవరు ఊహించని విధంగా ఈ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోర్టు తీర్పు ఎలా ఉన్నా కూడా ఆలయాన్ని కట్టి తీరుతామని చెప్పారు. అదికూడా ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో.. ఆ కార్యక్రమాలకు స్టార్ట్ చేస్తామని చెబుతూ.. పార్లమెంట్‌ ద్వారానే ఆలయ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పడం ప్రస్తుత దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక ఎక్కవగా దేశంలో ఉన్న ప్రజలు రామాలయాన్ని కోరుకుంటున్నారని కోర్టు కూడా వారి మనోభావాలను గుర్తిస్తుందని తెలుపుతూ.. ఆ స్థలమంతా రాముడికి సంబందింనచినదే అని నృత్య గోపాల్‌ దాస్‌ ప్రకటించారు.

  •  
  •  
  •  
  •  

Comments