బ్లూ వెల్ గేమ్ పై సుప్రీమ్ కోర్టు సంచలన తీర్పు

Saturday, October 28th, 2017, 03:00:54 AM IST

మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలిజీ వ్యవస్థలో కూడా భారీ మార్పులు వచ్చాయి. ఇప్పటివరకు మానవుడు కూర్చున్న చోటు నుండే అన్ని పనులను ఆపరేట్ చేస్తున్నాడు అంటే అంతా టెక్ మహిమ. అయితే ఈ టెక్నాలిజీ ఎంత ఉపయోగపడుతుందో అంతే స్థాయిలో మనిషికి చెడును కలిగిస్తోంది. ఇటీవల కొన్ని దేశాల్లో బ్లూ వెల్ అనే గేమ్ చాలా మంది చిన్నారులను ఆత్మహత్య చేసుకునేలా చేసింది.

చిన్న చిన్న టాస్క్ లు ఇస్తూ నెటిజన్స్ ని పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకొని చివరికి వారితోనే వారిని చంపుకునేలా చేసే ఈ గేమ్ ను రష్యాకు చెందిన మానసిక ఉన్మాది తయారు చేశాడు. ఇప్పటికే ఈ పలుదేశాల్లో ఈ గేమ్ ను నిషేదించారు. భారత్ లో కూడా ఇప్పుడిపుడే ఈ గేమ్ వైరల్ అవుతుండడంతో సుప్రీమ్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దేశంలో ఉన్న ప్రతి ఒక మీడియా సంస్థలు ఈ విషయాన్ని బాధ్యత తీసుకోవాలని చెబుతూ..ప్రజలకు దాని వల్ల కలిగే నష్టాలను వివరించాలని తీర్పు చెప్పింది. అంతే కాకుండా ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రోజు దూరదర్శన్ ద్వారా ప్రత్యేకంగా ప్రోగ్రాంల ద్వారా అవగాహన కల్పించాలని చెప్పింది.