మొబైల్, బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకు విషయమై స్పందించిన సుప్రీమ్ కోర్ట్!

Wednesday, March 14th, 2018, 03:02:53 AM IST

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రవేశపెట్టిన, అలానే ప్రవేశ పెడుతున్న దాదాపు ప్రతి పథకానికి ఆధార్ అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే దాదాపుగా ప్రతిఒక్క భారతీయుడు ఆధార్ కలిగివుండడం తన హక్కని ప్రభుత్వం ప్రకటనలతో ఊదరగొడుతోంది కూడా. ఇప్పటివరకు చాలా పథకాలకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ వర్తింప చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మొబైల్, బ్యాంకు ఖాతాలకు ఆధార్ జతచేయడం కొంత మేర ప్రభుత్వానికి సమస్యగా మారినట్లు తెలుస్తోంది.

ఎందుకంటె ప్రతిసారి ఆధార్ అనుసంధానంతో ఆ గడువును సుప్రీమ్ కోర్ట్ పొడిగిస్తూ వస్తోంది. అలానే ఈ సంవత్సరం కూడా మర్చి 31తో ఆ గడువు ముగియనుండటంతో దాదాపు చాలామంది తమ మొబైల్, అలానే బ్యాంకు ఖాతాలకు ఆధార్ జత చేస్తున్నారు. కానీ అప్పటికి మరికొందరివి పెండింగ్ లోనే ఉంటున్నాయి. దీనిపై నేడు స్పందించిన సుప్రీమ్ కోర్ట్ ప్రస్తుతానికి బ్యాంకు, మొబైల్ సేవలకు ఆధార్ అనుసంధానం పై ఈ గడువు తుది గడువు కాదని, త్వరలో గడువు పొడిగించే అవకాశం లేకపోలేదన్న విధంగా స్పందించింది. అయితే తుది గడువు ఎప్పుడన్నది త్వరలో ప్రకటించడం జరుగుతుందని దీన్ని బట్టి అర్ధం అవుతోందని నిపుణులు అంటున్నారు. సో ప్రస్తుతానికి ఈ నెల 31 తేదీ అనేది వాటి అనుసంధానానికి తుది గడువు కాదన్నమాట….

  •  
  •  
  •  
  •  

Comments