సుప్రీం కోర్టు షాక్ కి యడ్యూరప్పకి సీఎం పదవి ఉండేనా….ఊడేనా

Friday, May 18th, 2018, 04:03:20 PM IST

గత కొద్దిరోజులుగా దేశంలో ఎన్నడూ లేని విధంగా కర్ణాటక రాష్ట్ర ఎన్నికలు అతికుతూహలంగా చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇదే దశలో మొన్నటి రోజు కర్ణాటక భాజాపా అధినేత యడ్యూరప్ప గవర్నర్ వజూభాయ్ వాలా సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయగా తమ పార్టీ బలనిరూపణ చేసుకోవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ బలనిరూపణకు గవర్నర్ యడ్యూరప్పకు ౧౫ రోజుల సమయం కూడా ఇచ్చిన సంగతి విదితమే. కానీ ఇప్పుడే రాష్ట్రం దద్దరిల్లేలా సుప్రీం కోర్తుఅటు గవర్నాట్ వాలాకి ఇటు యడ్యూరప్పకి ఊహించని షాక్ ఇచ్చి అయోమయానికి గురి చేసింది.

సీఎం గా ప్రమానస్వీకారం చేసిన యడ్యూరప్పకి రేపే బలనిరూపణ చేసుకోవలసిందిగా ఆదేశించింది. అదొకటే కాదండోయ్, బల పరీక్ష నిరూపణ అయ్యి సీఎం పదవి కచ్చితం అయ్యేంతవరకు ఎలాంటి పరిస్థితిలలోనూ రాష్ట్రానికి సంబందించిన నిర్ణయాలు తీస్కోకూడదు అని హెచ్చరికలు జారీ చేసింది.
అంతేకాకుండా గవర్నర్ కి కూడా సుప్రీం కోర్టు నుండి చివాట్లు పడ్డాయి. ఒక ఆంగ్లో ఇండియన్ వర్గానికి చెందిన ఏ వ్యక్తిని అయినా ఎమ్మెల్యేగా నియమించడానికి గవర్నర్ కి అర్హత లేదు అని వజూభాయ్ వాలాని హెచ్చరించింది. మరోవైపు యడ్యూరప్పను సీఏం చేయడంపై స్టే విదించవలసిందిగా కాంగ్రెస్ నేతలు భాజాపా పై వేసిన పిటీషన్ ను స్టే ఇవ్వడం కుదరదని ఎవరికీ నచ్చినట్టు వారు ప్రవర్తించడానికి ఇది తోలు బొమ్మల ఆట కాదని పిటిషన్ ను తిరస్కరించింది. భాజాపా మాత్రం రేపటి లోపు ఎట్టి పరిస్థితుల్లో బలపరీక్ష నిరూపించుకోవాలని, దానికి సంబందించిన ఏర్పాట్లను ఇప్పటి నుండే మొదలు పెట్టుకోవలసిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. లేదంటి సీఎం పదవి నుంచి తొలగించడానికి వేనుకాడబోయేది లేదని హెచ్చరికలు కూడా జారీ చేసింది.