నేర ఆరోపణలు ఉంటే మన నేతల మీద వేటేనా?జగన్,బాబుల పరిస్థితి ఏంటి?

Tuesday, September 25th, 2018, 12:30:00 PM IST

ఈ రోజు సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది,ఈ రోజు తీసుకోబోయే నిర్ణయం మీద మన దేశ రాజకీయ నాయకుల భవిష్యత్తు ఆదారపడి ఉండబోతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.మన దేశంలో ప్రస్తుతం ఇప్పుడున్న పార్టీలలో నేర ఆరోపణలు,అవినీతి ఆరోపణలు ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు,అయితే వారు ఆ నేరం చేశారు లేదు అన్నది నిరూపితం అయ్యేంత వరకు వారు రాజకీయ నాయకులుగా ఉండొచ్చు,అదే చిన్న పోలీసు కేసు ఒక సామాన్యుడి మీద నమోదు అయ్యినా సరే వారు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కాదు.మరి అలాంటప్పుడు నేర ఆరోపణలు ఉన్న రాజకీయ నాయకులు మాత్రం మమ్మల్ని పాలించడానికి ఎలా అర్హులు ఎలా అవుతారని ప్రశ్నించిన వారు కూడా లేకపోలేరు.

ఇప్పుడు ఈ విషయం పైనే సుప్రీంకోర్టు ఒక తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది అని తెలుస్తుంది.అయితే నేర ఆరోపణలు నిరూపణ కానప్పుడు ఆ రాజకీయ నేతలు ఎలా అర్హులు కారని కూడా ప్రశ్నించే వారు కూడా ఉన్నారు,ఇప్పటికే ఎన్నో కొలిక్కి రాని కేసులు ఉన్నాయన్న ధీమాతో మరికొంత మంది నేతలు అవినీతికి పాల్పడుతున్నారని,అందుకనే ఒక సరైన నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతుందని తెలుస్తుంది.ఇప్పుడు ఇందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ లోను అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలులో కూడా ఉన్న రాజకీయ నాయకులు లేకపోలేరు.

కొన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదించాడని వై ఎస్ జగన్ మీదను మరియు ఓటుకు నోటు కేసుల్లో చంద్రబాబు నాయుడు గార్ల మీదను కేసులు ఉన్నాయన్న సంగతి కూడా తెలిసిందే వీరు ఇప్పుడున్న నేతల్లో అన్ని విధాలా బలమైన నేతలు కావడం వలన వీరి మీద కేసులు సరిగ్గా నిలబడనివ్వడం లేదనే వాదనలు కూడా వినిపిస్తాయి.ఇప్పుడు సుప్రీంకోర్టు అవినీతి ఆరోపణలు ఉన్న నేతలుకు ప్రజలని పాలించే హక్కు లేదని తీర్పునిస్తే..?వీరి ఇరువురి రాజకీయ భవిష్యత్తుకి పెద్ద కోలుకోలేని దెబ్బె అని చెప్పాలి. సుప్రీంకోర్టు ఇప్పుడు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అని దేశం అంతటా ఎదురు చూస్తుంది.