ఇక నుంచి స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చిన సుప్రీం కోర్టు !

Thursday, September 6th, 2018, 11:40:05 PM IST

స్వలింగ సంపర్కం నేరం కాదని, గే సెక్స్‌ కు చట్టబద్ధత కల్పిస్తూ తాజాగా సుప్రీం కోర్టు సంచలాత్మకమైన తీర్పును వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే స్వలింగ సంపర్కం అసహజ లైంగిక చర్య కాదని, కాబట్టి ఇది భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377 కిందికి రాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇక నుంచి ఈ తీర్పు ప్రకారం ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు స్త్రీలు ఇష్టపడి సెక్స్‌లో పాల్గొంటే అది నేరంగా పరిగిణిలోకి రాదు. అయితే ఈ తీర్పు పై ఇప్పటికే స్వలింగ సంపర్కలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ స్పందిస్తూ.. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని, సెక్షన్‌ 377ను సుప్రీం కోర్టు కొట్టివేయడం పూర్తిగా ఆహ్వానించదగినదని, నిజంగా ఇది సమాన హక్కులకు దక్కిన గౌరవమని కరణ్‌ జోహార్‌ ట్వీట్‌ చేయడం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments