రైలు ప్రమాదాలపై సుప్రీమ్ సంచలన తీర్పు!

Thursday, May 10th, 2018, 02:23:10 PM IST

ఇకపై ఎపుడైనా భవిష్యత్తులో రైలు ప్రమాదాలు జరిగినపుడు అది ప్రయాణికుల నిర్లక్ష్యమని చెప్పి రైల్వే శాఖ తప్పించుకోవడానికి వీలుండదు. ప్రయాణీకులకు ఏ చిన్న ప్రమాదం జరిగినా దానికి రైల్వే శాఖ నష్టపరిహారం చెల్లించవలసిందే అని భారతీయ అత్యున్నత న్యాయశాఖ సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. అంటే రైలు ఎక్కేటప్పుడు, దిగేటపుడు ఎవరైనా ప్రమాదవశాత్తు పడి గాయాలపాలయినా, లేదా మరణించినా దానికి తగ్గ పరిహారం రైల్వే శాఖ చెల్లిస్తుందన్నమాట. వాస్తవానికి రైల్వే చట్టం 1989 లోని సెక్షన్ 124ఏ ప్రకారం ఎవరైనా రైల్వే ప్రయాణీకుడికి ప్రమాదం జరిగితే ఈ సెక్షన్ కింద నష్టపరిహారం చెల్లించాల్సిఉన్నప్పటికీ,

పలు సందర్భాల్లో అది ప్రయాణీకుడి నిర్లక్ష్యమని రైల్వే శాఖ హైలైట్ చేస్తూ పరిహారం చెల్లించకుండా తప్పించుకున్న కేసులు చాలానే వున్నాయి. ఈ విధంగా రైల్వే శాఖ ఇకపై సాకులు చెప్పి తప్పించుకోవడానికి వీలుండదనేది సుప్రీం కోర్ట్ తీర్పు సారాంశం. కాగా ఇటీవల జరిగిన కొన్ని రైలు ప్రమాదాల్లో పలువురు గాయపడ్డ వారు హై కోర్ట్ లో పరిహారం కోసం అప్పీల్ చేయగా, అది ప్రయాణీకుడి తప్పిదమేనని ఆ శాఖవారు చెప్తున్న సందర్భాలను బట్టి సుప్రీమ్ ప్రయనేకులకు మేలు చేసేలా ఈ సంచలనం నిర్ణయాన్ని తీసుకుంది……..

  •  
  •  
  •  
  •  

Comments