ముఖ్యమంత్రి వద్దకు హెల్మెట్ తో..లేడి ఎంపీ అలా ఎందుకు వెళుతోందబ్బా..?

Friday, September 30th, 2016, 01:19:57 PM IST

supriya
మహారాష్ట్ర ముఖ్యంమత్రి దేవేంద్ర ఫడణవీస్ వద్దకు వెళితే తాను హెల్మెట్ పెట్టుకుని వెళతానంటోంది ఓ లేడి ఎంపీ.ఎన్ సిపి పార్టీ కి చెందిన మహిళా ఎంపీ సుప్రియ సులే దేవేంద్ర ఫడణవీస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమత్రి వద్ద కు వెళ్లాల్సివస్తే హెల్మెట్ తో వేళ్ళ వలసి వస్తోందని మండి పడ్డారు.ఆయనో పెద్ద షార్ట్ టెంపర్ అని మండిపడ్డారు.

పూణే లో జరిగిన ఎన్ సిపి మహిళా కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపించారు.”నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను. ఇలాంటి షార్ట్ టెంపర్ సీఎం ని చూడలేదు. అతనితో సమావేశం అవ్వాల్సివస్తే హెల్మెట్ తో వెళతాను.ఎందుకంటే ఆయనకు కోడం వస్తే ఏదిపడితే అది మీదికి విసిరేస్తారు”అని సుప్రియ సులే అన్నారు. అంతే కాక ఆయన కుళాయిలవద్ద మహిళలు గొడవ పడినట్లు గొడవ పడతారని ఎద్దేవా చేశారు.ఎన్ సిపి అధినేత సరితా పవార్ కుమార్తె అయిన సుప్రియ సులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.