సమస్యల్లో సురేష్ బాబు ఫ్యామిలీ!

Friday, June 15th, 2018, 02:04:07 AM IST

ఆ ఆ! సమస్యలు అంటే ఆర్ధిక సమస్యలు అనుకోకండి. అదేమి కాదండి ఇటీవల శ్రీ రెడ్డి సమస్యతో నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరాం ఫోటోలు బయటకి రావడంతో సురేష్ బాబు ఫామిలీకి అది కొంత సమస్యలు తెచ్చిపెట్టిందని, అతని వల్ల ఇప్పటికే వారి ఫామిలీ కొన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరుకాకుండా దూరమయిదని ఫిలింనగర్ టాక్. అయితే ఇక మరొక సమస్యతో ప్రస్తుతం ఆ కుటుంబం అల్లాడుతోందనేది మరొక వార్త. మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అయన పెద్ద కుమారుడు రానాకు చిన్నప్పుడు ఒక కన్ను దెబ్బతినడంతో దానిస్థానే మరొక కన్ను అమర్చారట. దానివల్ల కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న రానా కొద్దిరోజులుగా విదేశాలకు వెళ్లి వస్తున్నారని అంటున్నారు.

అయితే సమస్య మరి అంత పెద్దదేమీ కాదని, కొంచెం చికిత్స తీసుకుంటే బాగానే ఉంటుందని ఆయన సన్నిహితులు చెపుతున్నప్పటికీ, ఏదో సమస్య మాత్రం వారి కుటుంబాన్ని కుంగదీస్తోందనేని మరి కొందరి వాదన. నిజానికి శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత అభిరాం ని సురేష్ బాబు పెద్దగా బయటకి రానివ్వడం లేదని, రానున్న రోజుల్లో అతని భవిష్యత్తుపై కూడా కొంత వారి భార్య భర్తలకు దిగులు ఏర్పడిందని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదుకాని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం సురేష్ బాబు ఫామిలీ సమస్యల నుండి త్వరగా బయటపడి హాయిగా, ఆనందంగా ఉండాలని కోరుకుంతున్నారు. అయితే ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే వారి ఫామిలీ నుండి అధికారిక ప్రకటన వెలువడవలసిందే మరి…