చైతూను గైడ్ చేస్తున్న సురేష్ బాబు..!

Tuesday, November 20th, 2018, 08:41:00 PM IST

నాగచైతన్య కెరీర్ విషయంలో నాగార్జున ఎంత శ్రద్ధ తీసుకుంటున్నా కానీ, ఇప్పటివరకు చైతూకు సరైన హిట్ పడలేదు. తన స్వీయ నిర్మాణంలో పలు చిత్రాలు నిర్మించినా ఫలితం లేకపోయింది. ఈ మధ్య చైతన్య మార్కెట్ మరింత పడిపోవటంతో అతని ఫ్యూచర్ గురించి నాగార్జున ఆందోళన చెందుతున్నాడట.ఈ నేపథ్యంలో చైతూ పెద్ద మామ సురేష్ బాబు రంగంలోకి దిగాడట.

బాబీ దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్యలపై సురేష్ బాబు ఓ మల్టి స్టారర్ ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే, అయితే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమా కథ విషయంలో సురేష్ బాబు చాలా కఠినంగా ఉన్నాడట, సాధారణంగా సురేష్ బాబు సినిమా ప్రారంభించే ముందు కథ గురించి ఎలాంటి సందేహాలు లేకుండా చేసుకుంటాడట. ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా నాగ చైతన్య కోసం ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నడట, వెంకటేష్ కు ఇంత స్టార్ డమ్ రావటానికి ముఖ్య కారణం సురేష్ బాబు అని చెప్తుంటారు. ఇపుడు నాగ చైతన్య కెరీర్ లో హిట్ అత్యంత అవసరం, ఈ నేపథ్యంలో నాగ చైతన్యకు సురేష్ బాబు గైడెన్స్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి మరి.