ప్రాణం తీసిన వెంట్రుకల శస్త్ర చికిత్స..!

Monday, September 3rd, 2018, 04:20:41 PM IST

ప్రస్తుతం గడుస్తున్న రోజుల్లో ఆడవారు, మగవారు వారి వేషధారణ పైన మరియు కేశాలంకరణ మీద ఎక్కువ శ్రద్ధ తీస్కుంటున్నారు.. ఇది మితంగా ఉంటె పరవాలేదు అమితంగానే ఉండకూడదు..అలా అమితమైన శ్రద్ధ ఒక యువతి ప్రాణాన్ని తీసింది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొడుగు జిల్లా కొట్టిగేరి గ్రామానికి చెందిన నేహ గంగమ్మ అనే యువతికి ఉంగరాల శిరోజాలు ఉండేవి. అయితే ఎవరో చెప్పిన మాటలు విని ఆ శిరోజాలని మరింత ఇంపుగా చేసుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకుంది.

అయితే కొద్ది రోజులకి ఆమె శిరోజాలలో మార్పు కనిపించి జుట్టు ఊడిపోవడం మొదలు అయ్యింది. అయితే మరి కొద్ది రోజులకి ఆమె జుట్టు మొత్తం ఊడిపోయింది. దానితో ఆమె స్నేహితులు వద్ద మొహం చూపించలేక కొద్ది రోజులు ఇంట్లోనే ఉండిపోయి తీవ్ర మనస్తాపానికి గురి అయ్యింది.. ఆ తర్వాత కొద్ది రోజులుకి ఆమె కనిపించలేదు.. ఆ తర్వాత ఆమె అక్కడ లక్ష్మణ తీర్ధం అనే నది లో ఆమె మృత దేహం కనిపించింది..

  •  
  •  
  •  
  •  

Comments