కొహ్లీకి ఆశ్చర్యకర బహుమతి!

Friday, February 9th, 2018, 08:16:16 PM IST

భారత జట్టు సారధి విరాట్ కోహ్ల, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు సుమారు రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుండి కొంత కాలంపాటు సినిమాలకు దూరంగా వున్నా అనుష్క ఇటీవల తిరిగి షూటింగ్లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటనలో బిజీగా వున్న విషయం తెలిసిందే. అయితే అనుష్క తండ్రి అజయ్‌ కుమార్‌, తన అల్లుడు కోహ్లికి ఒక ప్రత్యేకమైన కానుక ఇచ్చినట్లు తెలుస్తోంది. కవితలంటే అమితంగా ఇష్టపడే విరాట్ కి ప్రముఖ రచయిత్రి తేజశ్విని దివ్యా నాయక్‌ రచించిన ‘స్మోక్స్‌ అండ్‌ విస్కీ’ అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారని సమాచారం. ఇందులో రిలేషన్‌షిప్‌కు సంబంధించిన 42 రచనలు ఉన్నాయి. గురువారం ముంబయిలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిలో భాగంగా ఒక కాపీని దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆయన అల్లుడు కోహ్లికి పంపించినట్లు తెలుస్తోంది….

  •  
  •  
  •  
  •  

Comments